Shivaji Raja- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక ఆయన వ్యక్తిత్వాన్ని కుటుంబాన్ని టార్గెట్ చేసి ప్రత్యర్థులు ఎంతగానో వేధించారు. ఇందులో చాలా మందిని పావులుగా వాడారు. వివాదాస్పద నటి శ్రీరెడ్డిని వినియోగించుకున్నారు. అప్పట్లో శ్రీరెడ్డి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఆఫీస్ ముందు అర్ధనగ్నంగా బట్టలిప్పి చేసిన తతంగం అంతా తెలిసిందే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ను , వారి తల్లిని ఉద్దేశించి శ్రీరెడ్డి చేసిన రచ్చను ఎవరూ మరిచిపోలేదు.

ఆ సంఘటన ఇప్పటికీ పదిలంగానే ఉంది. ఈ క్రమంలోనే నాడు మా ప్రెసిడెంట్ గా ఉన్న శివాజీ రాజా దీనికి పవన్ కళ్యాణ్ నుంచి ఎంతో ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చిందట.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు..
Also Read: Mahesh Babu Daughter Sitara Crying: వీడియో: వెక్కివెక్కి ఏడ్చిన సితార.. ఓదార్చిన మహేష్, నమ్రత
‘తాను మా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే మా ఆఫీసు ముందు శ్రీరెడ్డి వివాదం చేసింది. పవన్ కళ్యాణ్ ను, ఆయన తల్లిని తీవ్రంగా దూషించింది.. ఆ టైంలోనే పవన్ కళ్యాణ్ డజను మంది లాయర్లతో మా ఆఫీసుకొచ్చాడు. నేను నాగశౌర్య ‘నర్తనశాల’ షూటింగ్ లో ఉండగా పవన్ వచ్చాడని రమ్మంటున్నట్టు కాల్ రాగానే షూటింగ్ ఆపేసి వచ్చాను. శ్రీరెడ్డి అంత రచ్చ చేసినా ఎందుకు ఆమెపై కోర్టులో కేసు వేయలేదని.. పోలీసులకు ఫిర్యాదు చేయలేదని పవన్ తనపై కోపంతో ఊగిపోయాడు.. చాలా కోపంగా ఉన్నారు. అంత కోపాన్ని పవన్ లో తానెప్పుడూ చూడలేదని’ శివాజీరాజా పాత సంగతులు గుర్తు చేశారు.

నేను చెబుతుంటే కోపాన్ని నిగ్రహించుకోలేక స్తంభం చుట్టూ తిరిగాడని.. నన్ను కొట్టేస్తేడేమోనన్నంత భయం కలిగిందని శివాజీ రాజా తెలిపారు. తాను ఫిర్యాదు చేశానని ఆ కాపీని ఇవ్వగా.. తన లాయర్లకు ఇవ్వాలని పవన్ సూచించాడు. ఆ రూంలోకి వెళ్లే సరికి జడ్జీ లేడు కానీ ఒకకోర్టు హాలులో డజను మంది లాయర్లు అక్కడున్నారని శివాజీరాజా తెలిపారు. పవన్ ను అంత కోపంతో చూడడం అదే తొలిసారి అని.. నా మిత్రుడైన పవన్ ను అలా కలిసినందుకు బాధపడ్డానని శివాజీరాజా తెలిపారు.
Also Read: Indira Gandhi- Bathukamma: బతుకమ్మతో ఇందిరాగాంధీ…. రేర్ ఫోటో వైరల్.. ఎప్పుడు ఎక్కడ ఇదీ.!…
[…] […]
[…] […]
[…] Also Read: Shivaji Raja- Pawan Kalyan: Shivaji Raja has never seen Pawan Kalyan so furious.. She is the reason … […]