Homeజనరల్Hair Care: జుట్టు రంగు రావడానికి దీనిని వాడుతున్నారా?

Hair Care: జుట్టు రంగు రావడానికి దీనిని వాడుతున్నారా?

Hair Care: జుట్టు రంగు రావడానికి దీనిని వాడుతున్నారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది తీసుకునే ఆహార పదార్థాల్లో కల్తీ ఉండటంతో శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటిలో జుట్టు సమస్య కూడా ఒకటి. వయసు మీద పడకుండానే చాలామంది తెల్ల జుట్టుతో బాధపడుతున్నారు. మరికొందరు చిన్న వయసులోనే బట్టతలను కలిగి ఉంటున్నారు. ఈ సమస్య నివారణకు కొంతమంది ప్రత్యేకంగా మెడిసిన్స్ తీసుకుంటుండగా.. మరికొందరు లక్షల రూపాయలు పెట్టి చికిత్స చేయించుకుంటున్నారు. అయితే కొంతమంది ఆరోగ్య నిపుణులు తెలుపుతున్న […]

Hair Care: జుట్టు రంగు రావడానికి దీనిని వాడుతున్నారా?

ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది తీసుకునే ఆహార పదార్థాల్లో కల్తీ ఉండటంతో శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటిలో జుట్టు సమస్య కూడా ఒకటి. వయసు మీద పడకుండానే చాలామంది తెల్ల జుట్టుతో బాధపడుతున్నారు. మరికొందరు చిన్న వయసులోనే బట్టతలను కలిగి ఉంటున్నారు. ఈ సమస్య నివారణకు కొంతమంది ప్రత్యేకంగా మెడిసిన్స్ తీసుకుంటుండగా.. మరికొందరు లక్షల రూపాయలు పెట్టి చికిత్స చేయించుకుంటున్నారు. అయితే కొంతమంది ఆరోగ్య నిపుణులు తెలుపుతున్న ప్రకారం ఇంట్లోనే ఇలాంటి పదార్థాన్ని తయారుచేసుకొని వాడడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా తెల్ల జుట్టు సమస్యల నుంచి బయటపడవచ్చు అని కొందరు చెబుతున్నారు.. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ప్రకృతిలో లభించే గోరింటాకు ఎంతో ఆరోగ్యకరమని ఇప్పటికే నిరూపితమైంది. ఆషాడ మాసం రాగానే గోరింటాకుతో చేతులకు రాసుకుంటూ ఉంటారు. అయితే ఇది హెన్నా పేరుతో మార్కెట్లోకి వస్తుంది. దీనిని జుట్టుకు వేయడం వల్ల తెల్ల జుట్టు ఎర్రగా మారిపోతుంది. అయితే ఇప్పుడు మార్కెట్లో బ్లాక్ హెన్నా కూడా అందుబాటులోకి వచ్చింది. ప్యూర్ హెన్నా, బ్లాక్ హెన్నా మధ్య తేడా చాలా ఉంటుంది.

ప్యూర్ హెన్నా ను గోరింటాకు ఆకులను ఎండబెట్టి పొడిగా తయారు చేసి మార్కెట్లోకి తీసుకువస్తారు. దీనిని జుట్టుకు అప్లై చేయడం వల్ల కేవలం 10 నిమిషాల్లోనే ఎరుపు రంగులోకి మారుతుంది. అయితే బ్లాక్ హెన్నా తో జుట్టు బ్లాక్ అవుతుందని చాలామంది భావిస్తారు. కానీ ఇందులో PPD అనే రసాయనాలు కలుపుతున్నట్లు కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీనివల్ల తలపై తీవ్రమైన దురద ఉండడంతో పాటు అలర్జీలు ఏర్పడతాయి. కొందరికి చర్మ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

అందువల్ల జుట్టుకు ఇది రాసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా దీనిని వాడే ముందు చెవి వెనకాల పరీక్ష చేయించుకోవాలి. అక్కడ చిన్న ప్రదేశంలో అప్లై చేసిన తర్వాత ఎలాంటి దురద లేదా ఎరుపుదనం లేకపోతే అప్పుడు ఇది సురక్షితమైనదని భావించి అప్లై చేసుకోవచ్చు. అలాకాకుండా ఏదైనా కొత్త లక్షణాలు కనిపిస్తే దానిని వాడుకోవద్దని చెబుతున్నారు. సహజమైన పద్ధతిలోనే జుట్టుకు రంగు వేయడం అవసరమని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper