Shiva Re Release: అక్కినేని ఫ్యామిలీ హీరోల్లో నాగేశ్వరరావు తర్వాత అంత గొప్ప ఇమేజ్ ని సంపాదించుకున్న నటుడు నాగార్జున… కెరియర్ మొదట్లో నాగ్ వరుసగా డిజాస్టర్లను మూట గట్టుకున్నాడు. ఇతను హీరోగా పనికిరాడు అని చాలామంది విమర్శించారు. అయినప్పటికి తను పట్టుదలని విక్రమార్కుడిలా సినిమాలను చేస్తూ వచ్చాడు. మొత్తానికైతే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో చేసిన శివ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అవ్వడమే కాకుండా అప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న రికార్డులను బ్రేక్ చేసింది. సినిమా అంటే ఇలా ఉండాలి అని ఒక బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసింది. అలాంటి శివ సినిమా ఈనెల నవంబర్ 14వ తేదీన రీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాను చూడడానికి చాలామంది ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తుండటం విశేషం…
రీసెంట్ గా వచ్చిన ఈ సినిమా ట్రైలర్ ని ఇప్పటికే 10 లక్షల మంది వీక్షించారు. మొత్తానికైతే ఈ సినిమా అనుకున్న దానికంటే భారీ సక్సెస్ ని సాధిస్తుందని చాలామంది కోరుకుంటున్నారు. ఇప్పటివరకు వచ్చిన స్టార్ హీరోల సినిమాలు ఎంత వసూళ్లను కలెక్ట్ చేశాయి అనే విషయం పక్కన పెడితే శివ సినిమా అంతకు మించిన కలెక్షన్స్ ని రాబట్టే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తున్నాయి.
ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటీనటులు దర్శకులు సైతం ఈ సినిమా రీ రిలీజ్ అవుతుంది చూడండి అంటూ వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీని రెండు భాగాలుగా విభజిస్తే ఒకటి శివ సినిమాకి ముందు, రెండు శివ సినిమా తర్వాత అని వర్ణించవచ్చు…
ఎందుకంటే ఈ సినిమా తెలుగు సినిమా మేకింగ్ మీద గొప్ప ఇంపాక్ట్ ను క్రియేట్ చేసింది. శివ సినిమా రామ్ గోపాల్ వర్మ కి హెల్ప్ అవ్వలేదు. టోటల్ ఇండస్ట్రీకి ఈ సినిమా ఆదర్శంగా నిలిచింది… అందువల్ల ఈ సినిమా కొత్త తరానికి ఒక టార్చ్ బేరర్ లా నిలిచిందనే చెప్పాలి. మొత్తానికైతే నాగార్జున అప్పటినుంచి ఇప్పటివరకు స్టార్ హీరోగా కొనసాగడానికి శివ కీలక పాత్ర వహించిందనే చెప్పాలి…