Ramya Krishna The Paradise: న్యాచురల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటుడు నాని…ఆయన చేసిన సినిమాలన్నీ ఇప్పటివరకు గొప్ప విజయాలను సాధించినవే కావడం విశేషం… తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయాలని చూస్తున్నాడు… గత రెండు సంవత్సరాల క్రితం దసర సినిమాతో మాస్ హీరోగా మారిన ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో మరో మెట్టు పైకి ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందుకోసమే ఆయన మాస్ సినిమాల వైపే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేస్తున్న ప్యారడైజ్ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని తెచ్చుకోవాలని చూస్తున్నాడు. పాన్ వరల్డ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో ఆయన ఎలాంటి క్రేజ్ ను సంపాదించుకుంటాడు అనేది ఇప్పుడు కీలకంగా మారబోతోంది. శ్రీకాంత్ ఓదెల లాంటి దర్శకుడు ఇంతకుముందు చేసిన దసర సినిమాతో తన మేకింగ్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు పరిచయం చేశాడు.
ఇక ప్యారడైజ్ లో అంతకుమించిన డిఫరెంట్ మేకింగ్ తో ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.
ఈ సినిమాలో నాని మదర్ క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ లో రమ్యకృష్ణ నటిస్తుందనే వార్తలు వచ్చినప్పటికి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం సోనాలి కులకర్ణి ఈ సినిమాలో నాని మదర్ గా నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. మోహన్ కోడా దర్శకత్వంలో వచ్చిన ‘ఎల్లమ్మ’ సినిమాలో కీలకపాత్రలో నటించిన ఆమె ఇప్పుడు నానికి మదర్ గా నటిస్తుండటం విశేషం…
ఇప్పటివరకు ఆమె చేసిన ప్రతి పాత్రలో ఆమె ఐడెంటిటిని చూపించుకుంటూ వచ్చారు. తమిళ్, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ సినిమాల్లో ఆమె క్యారెక్టర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండడంతో ఈ సినిమాలో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది… ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ లో నాని గురించి చెబుతూ ఒక వాయిస్ ఓవర్ వచ్చింది. ఆ వాయిస్ ఓవర్ కూడా తన క్యారెక్టర్ దే కావడం విశేషం… ఇక ఈ సినిమా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…