Jatadhara Movie First Review: సినిమాల మీద పిచ్చి ప్రేమతో, హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న హీరోలలో ఒకరు సుధీర్ బాబు(Sudheer Babu Ghattamaneni). ఇతని కెరీర్ మొత్తం మీద ‘ప్రేమ కథా చిత్రం’ అనే చిత్రం తప్ప, చేసిన ప్రతీ సినిమా ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. మధ్యలో ‘సమ్మతమే’ వంటి సినిమాలు వచ్చాయి కానీ, అది కూడా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు. ఓటీటీ లో మాత్రమే మంచి రెస్పాన్స్ ని తెచ్చుకుంది. ఇలా కెరీర్ మొత్తం ఫ్లాప్స్ ఎదురు అవుతున్నప్పటికీ సుధీర్ బాబు తన మొదటి సినిమాకు ఎంత కస్టపడి చేశాడో, ఇప్పటికీ అదే కష్టం తో ముందుకెళ్తున్నాడు. రీసెంట్ గా ఆయన ‘జటాధర'(Jatadhara Movie) అనే చిత్రం చేసాడు. ఇంతకు ముందు విడుదలైన సుధీర్ బాబు సినిమాలతో పోలిస్తే, ఈ సినిమా మంచి క్వాలిటీ తో తీసినట్టు థియేట్రికల్ ట్రైలర్ ని చూసినప్పుడు అనిపించింది.
ఈ చిత్రం లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, ధన పిశాచి గా, భయంకరమైన విలన్ క్యారక్టర్ లో కనిపించబోతోంది. అదే విధంగా మహేష్ బాబు మరదలు, నమ్రత శిరోద్కర్ సోదరి, శిల్పా ఘట్టమనేని కూడా ఇందులో కీలక పాత్ర పోషించింది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ నెల 7 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ ప్రివ్యూ షో ని నిన్న హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో స్క్రీనింగ్ చేశారు. ఇండస్ట్రీ కి చెందిన కొంతమంది ముఖ్యమైన మీడియా ప్రతినిధులు ఈ స్పెషల్ స్క్రీనింగ్ కి హాజరయ్యారు. ఈ మూవీ ప్రివ్యూ ని చూసిన ప్రతీ ఒక్కరు ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ గురించి గొప్పగా చెప్తున్నారు. మంచి డాల్బీ అట్మాస్ థియేటర్ లో ఈ ఫస్ట్ హాఫ్ ని చూస్తే హారర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అదిరిపోతాయని అంటున్నారు.
కానీ ఫస్ట్ హాఫ్ ఉన్న రేంజ్ లో సెకండ్ హాఫ్ లేదని టాక్. సినిమాలో విషయం ఉన్నప్పటికీ, డైరెక్టర్ గ్రిప్పింగ్ గా తీయడం లో విఫలం అయ్యినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ క్లైమాక్స్ మాత్రం అదిరిపోయిందని అంటున్నారు. ఈ క్లైమాక్స్ లో సుధీర్ బాబు మరియు సోనాక్షి సిన్హా నటన ఆడియన్స్ కి థియేటర్స్ నుండి బయటకు వెళ్లిపోయిన తర్వాత కూడా గుర్తు ఉంటుందని అంటున్నారు. ఆ రేంజ్ లో నటించారట. మరి వీళ్ళ కష్టానికి తగ్గ ఫలితాన్ని ఆడియన్స్ ఇస్తారో లేదో చూడాలి. ఒక్కటైతే నిజం, ట్రైలర్, రీ రిలీజ్ ట్రైలర్ చూసిన తర్వాత ఆడియన్స్ కి కచ్చితంగా థియేటర్ కి వెళ్లి చూడాలని అనిపిస్తోంది. అందుకు సంబంధించిన ట్వీట్స్ కూడా సోషల్ మీడియా లో చాలానే ఉన్నాయి.