https://oktelugu.com/

Shiva Nirvana: ప్చ్.. వరుసగా సంగీత దర్శకులతో గొడవలు !

Shiva Nirvana: దర్శకుడు శివ నిర్వాణ(Shiva Nirvana) గొడవ పడే మనిషి కాదు. కానీ, ఎందుకో ఆయనకు సంగీత దర్శకులతో వరుసగా గొడవలు అవుతున్నాయి. పైగా ప్రస్తుతం మ్యూజిక్ సంచలనంగా మారిపోయిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తో గొడవ పడటం అంటే చెప్పుకోతగ్గ విషయమే. శివ నిర్వాణ ఇప్పటివరకు తీసింది మూడు సినిమాలు. మొదటి సినిమా నిన్ను కోరి మ్యూజిక్ పరంగా సూపర్ హిట్ అయింది. రెండో సినిమా ‘మజిలీ’ ఇది కూడా మ్యూజికల్ హిట్ అనిపించుకుంది. […]

Written By: , Updated On : September 2, 2021 / 05:00 PM IST
Follow us on

Shiva NirvanaShiva Nirvana: దర్శకుడు శివ నిర్వాణ(Shiva Nirvana) గొడవ పడే మనిషి కాదు. కానీ, ఎందుకో ఆయనకు సంగీత దర్శకులతో వరుసగా గొడవలు అవుతున్నాయి. పైగా ప్రస్తుతం మ్యూజిక్ సంచలనంగా మారిపోయిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తో గొడవ పడటం అంటే చెప్పుకోతగ్గ విషయమే. శివ నిర్వాణ ఇప్పటివరకు తీసింది మూడు సినిమాలు. మొదటి సినిమా నిన్ను కోరి మ్యూజిక్ పరంగా సూపర్ హిట్ అయింది. రెండో సినిమా ‘మజిలీ’ ఇది కూడా మ్యూజికల్ హిట్ అనిపించుకుంది.

ఈ రెండు సినిమాలకు సంగీత దర్శకుడు ‘గోపి సుందర్’. ఐతే, ‘మజిలీ’ సినిమా రీ-రికార్డింగ్ సమయంలో ఇంటర్వెల్ మ్యూజిక్ విషయంలో శివ నిర్వాణకి – గోపి సుందర్ కి మధ్య గొడవ జరిగింది. దాంతో మజిలీ సినిమా నేపథ్య సంగీతాన్ని తమన్ చేత చేయించుకున్నాడు శివ నిర్వాణ. ఇక మూడో సినిమా ‘టక్ జగదీష్’కి తమన్ ని సంగీత దర్శకుడిగా పెట్టుకున్నాడు.

అయితే, విచిత్రంగా తమన్ తో కూడా శివకు గొడవ జరిగింది. పైగా ‘టక్ జగదీష్’ నేపథ్య సంగీతం విషయంలోనే తమన్ తో గొడవ జరిగింది. దాంతో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తమన్ చెయ్యను అని చెప్పి సినిమా నుండి తప్పుకున్నాడు. ఇక చేసేది ఏమి లేక శివ నిర్వాణ, మళ్ళీ గోపి సుందర్ దగ్గరకు వెళ్లి ‘టక్ జగదీష్’ నేపథ్య సంగీతాన్ని చేయించాడు. అంటే మజిలీ సినిమా విషయంలో జరిగింది, ఈ సారి రిపీట్ జరిగింది.

మొత్తానికి శివ నిర్వాణ సంగీతం విషయంలో అసలు కాంప్రమైజ్ కావడం లేదు. నిజానికి శివ నిర్వాణ చాలా కూల్ అని, అతను తన పని ఏదో తాను చేసుకుంటూ పోయే రకం అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. పైగా ఇప్పటివరకు ఎవరితో ఎలాంటి గొడవలు లేవు అని శివ గురించి చెబుతూ ఉంటారు. కానీ ఇక నుండి ఆ ఛాన్స్ లేదు.

శివ నిర్వాణకు సంగీత దర్శకులతో గొడవలు సహజం అనే టాక్ బయటకు వెళ్ళిపోయింది. అయినా తరుచూ నేపథ్య సంగీతం విషయంలో శివ నిర్వాణకి సంగీత దర్శకులతో అభిప్రాయబేధాలు వస్తే ఎలా? ప్రతి సినిమాకి ఇది అలవాటుగా మారితే ఆయనకే సమస్య. కాబట్టి ఇప్పటికైనా శివ నిర్వాణ మారితే బెటర్.