https://oktelugu.com/

Shilpa Shetty: భర్త చార్జిషీట్ లో హీరోయిన్ వివరణ ఇదే !

Shilpa Shetty: శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల కేసులో అడ్డంగా బుక్ అవ్వడంతో శిల్పాశెట్టి చాలా బాధలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంకా రాజ్ కుంద్రా జైల్లోనే మగ్గుతున్నాడు. మూడు నెలల అయింది, అయినా బెయిల్ రాలేదు. దీనికితోడు రాజ్ కుంద్రా పై 1500 పేజీల చార్జిషీట్ ను కూడా దాఖలు చేశారు. అయితే, ఈ చార్జిషీట్ లో శిల్పాశెట్టిని కూడా విచారించారు. విచారణలో భాగంగా ఆమె చెప్పిన మాటలు చాలామందిని ఆశ్చర్యపరిచాయి. శిల్పా పోలీసులకు […]

Written By:
  • admin
  • , Updated On : September 17, 2021 / 10:07 AM IST
    Follow us on

    Shilpa Shetty: శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల కేసులో అడ్డంగా బుక్ అవ్వడంతో శిల్పాశెట్టి చాలా బాధలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంకా రాజ్ కుంద్రా జైల్లోనే మగ్గుతున్నాడు. మూడు నెలల అయింది, అయినా బెయిల్ రాలేదు. దీనికితోడు రాజ్ కుంద్రా పై 1500 పేజీల చార్జిషీట్ ను కూడా దాఖలు చేశారు.

    అయితే, ఈ చార్జిషీట్ లో శిల్పాశెట్టిని కూడా విచారించారు. విచారణలో భాగంగా ఆమె చెప్పిన మాటలు చాలామందిని ఆశ్చర్యపరిచాయి. శిల్పా పోలీసులకు ఇచ్చిన వివరణ ఇలా సాగింది. ‘నా భర్త రాజ్ కుంద్రా బిజినెస్ గురించి నేను ఎప్పుడు అడగలేదు, అలాగే ఎన్నడూ పట్టించుకోలేదు. తన పని తానే చేసుకునేవారు,

    ఇక నా పనిలో నేను ఎప్పుడు బిజీగా ఉన్నాను. నా టీవీ షోలు, యోగా కార్యక్రమాలు, ఇల్లు.. వీటితోనే నా జీవితం గడిచిపోయేది. అందుకే నేను ఆయన పని గురించి, సంపాదన గురించి ఆలోచించలేదు. ఆయన అసలు హాట్ షాట్స్, బాలీ ఫేమ్ వంటి యాప్స్ బిజినెస్ చేస్తున్నాడనే విషయమే నాకు తెలియదు. ఆయన అరెస్ట్ అయిన తర్వాతే.. ఆ విషయాలు నాకు తెలిశాయి’ అంటూ శిల్పాశెట్టి చెప్పుకొచ్చింది.

    మొత్తానికి శిల్పా శెట్టి ఈ మధ్య తన భర్త కేసు గురించి పట్టించుకోవడం మానేసింది. ఎలాగూ తన భర్తతో విడిపోవాలని ఆమె నిర్ణయించుకుందట. అందుకే, మళ్ళీ ఇన్ స్టాగ్రామ్ లలో ఫోటోలు అప్ లోడ్ చేస్తూ సరదాగా గడుపుతుంది. పైగా తిరిగి టీవీ షోలతో బిజీగా మారింది. అన్నట్టు గణేష్ పండుగను కూడా ఘనంగా జరుపుకుంది.

    ఇక శిల్పా శెట్టికి, మహేష్ – త్రివిక్రమ్ సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటించనుంది. త్రివిక్రమ్ టీం ఆమెను తీసుకునే ఆలోచనలో లేరని ఈ మధ్య వార్తలు వచ్చినా ఆ వార్తలు నిజం కాదట. ఆమె మహేష్ సినిమాలో నటిస్తోంది.