Homeఎంటర్టైన్మెంట్ఆమె మహేష్ కి 'పిన్ని'.. ఇది త్రివిక్రమ్ ఆనవాయితీ !

ఆమె మహేష్ కి ‘పిన్ని’.. ఇది త్రివిక్రమ్ ఆనవాయితీ !

‘సూపర్ స్టార్ మహేష్ బాబు – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్’ చిత్రానికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందులో ఎంత నిజం ఉందనేది పక్కన పెడితే.. ఈ న్యూస్ మాత్రం మహేష్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ను ఇస్తోంది. ఇంతకీ న్యూస్ ఏమిటంటే.. మహేష్ కి పిన్నిగా బాలీవుడ్ సీనియర్ భామను రంగంలోకి దించబోతున్నాడు త్రివిక్రమ్. ఆ భామ ఎవరంటే.. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ‘శిల్పా శెట్టి’. త్రివిక్రమ్ రాసుకున్న […]

Shilpa Shetty‘సూపర్ స్టార్ మహేష్ బాబు – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్’ చిత్రానికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందులో ఎంత నిజం ఉందనేది పక్కన పెడితే.. ఈ న్యూస్ మాత్రం మహేష్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ను ఇస్తోంది. ఇంతకీ న్యూస్ ఏమిటంటే.. మహేష్ కి పిన్నిగా బాలీవుడ్ సీనియర్ భామను రంగంలోకి దించబోతున్నాడు త్రివిక్రమ్.

ఆ భామ ఎవరంటే.. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ‘శిల్పా శెట్టి’. త్రివిక్రమ్ రాసుకున్న కథలో ఓ క్యారెక్టర్‌ చాల కీలకమైనది అట. ఆ పాత్రలో సాగరకన్య శిల్పా అయితేనే న్యాయం జరుగుతుందని త్రివిక్రమ్ ఆమెను సంప్రదించి, మొత్తానికి ఆమెను ఒప్పించాడు. ఎలాగూ శిల్పా శెట్టి కూడా ఖాళీగానే ఉంటుంది కాబట్టి, పైగా భారీ రెమ్యునరేషన్ కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా సైలెంట్ గా ఒప్పేసుకుంది.

మరి శిల్పా శెట్టి క్యారెక్టర్ కి మహేష్ క్యారెక్టర్ కనెక్షన్ ఏమిటంటే.. మహేష్ కి ఆమె పిన్నిగా కనిపించబోతుంది. పిన్ని అంటే తన తండ్రి రెండో భార్య అట. మహేష్ కి ఆమెకు మధ్య సీన్స్ చాల కొత్తగా ఉంటాయని.. ముఖ్యంగా ఆమె క్యారెక్టర్ మోడ్రన్‌ గా ఉంటూనే, హీరోతో పోటాపోటీగా కూడా ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి తనకు ఉన్న అలవాటును త్రివిక్రమ్ మహేష్ సినిమాలో కూడా చూపించబోతున్నాడు.

తన ప్రతి సినిమాలో ఓ సీనియర్ హీరోయిన్‌ ని పెట్టడం త్రివిక్రమ్ కి ఆనవాయితీ అయిపోయింది. ఈ క్రమంలోనే నదియా, ఖుష్బూ, దేవయాని, టబు, ఇప్పుడు శిల్పా శెట్టి. పైగా పదకొండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో భారీ అంచనాలతో రానున్న ఈ సినిమా పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే హారికా హాసిని క్రియేషన్స్ 2022లో సమ్మర్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper