https://oktelugu.com/

రాజ్ కుంద్రా ఇలా అశ్లీలంలోకి దించాడట?

ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ వ్యవహారంలో అనేక సంచలనాలు వెలుగుచూస్తున్నాయి. కామసూత్ర 3డీ ఫేమ్ షెర్లిన్ చోప్రా విస్తుగొలిపే విషయాలు వెల్లడించారు. రాజ్ కుంద్రా తనను తప్పు దోవ పట్టించి అశ్లీల చిత్రాల్లో నటించేందుకు ఒప్పుకునేలా చేసినట్లు పేర్కొంది.అశ్లీల వీడియోలు చేయడంలో తప్పేమి లేదని తనను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించింది. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించింది. అశ్లీల రాకెట్ కేసులో షెర్లిన్ చోప్రాను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శుక్రవారం […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 7, 2021 / 10:58 AM IST
    Follow us on

    ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ వ్యవహారంలో అనేక సంచలనాలు వెలుగుచూస్తున్నాయి. కామసూత్ర 3డీ ఫేమ్ షెర్లిన్ చోప్రా విస్తుగొలిపే విషయాలు వెల్లడించారు. రాజ్ కుంద్రా తనను తప్పు దోవ పట్టించి అశ్లీల చిత్రాల్లో నటించేందుకు ఒప్పుకునేలా చేసినట్లు పేర్కొంది.అశ్లీల వీడియోలు చేయడంలో తప్పేమి లేదని తనను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించింది. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించింది.

    అశ్లీల రాకెట్ కేసులో షెర్లిన్ చోప్రాను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శుక్రవారం 8 గంటల పాటు విచారించారు. రాజ్ కుంద్రా తనతో మభ్యపెట్టి అశ్లీల వీడియోల్లో పాల్గొనేలా చేశారని పేర్కొంది. ఇందులో నటిస్తే భవిష్యత్ లో మంచిపేరు వస్తుందని నమ్మించి తనతో ఇలాంటి పనులు చేయించారని వాపోయింది. రాజ్ కుంద్రా వలలో చిక్కిన తనను అన్ని రకాలుగా ఉపయోగించుకుని అశ్లీల వీడియోల్లో నటించేందుకు అంగీకరించేలా చేశారని పేర్కొంది.

    రాజ్ కుంద్రా గ్లామరస్ వీడియోలని చెప్పి తనను తప్పుదోవ పట్టించాడని వాపోయింది. అర్థనగ్న, నగ్న చిత్రాల్లో నటింపచేశారని బాధపడింది. అశ్లీల చిత్రాలు సాధారణమని అందరు చేసే పని అని బుకాయించాడన్నారు. పైగా తన చిత్రాలను శిల్పాశెట్టి సైతం చూసి మెచ్చుకుందని చెబుతూ తనను తప్పుదోవ పట్టించాడని చెప్పింది. దీంతో తాను రాజ్ కుంద్రా మాయలో పడిపోయి ఏం చేస్తున్నానో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్లిపోయినట్లు తెలిపింది.

    రాజ్ కుంద్రాను పోలీసులు జులై 19న అరెస్టు చేసి విచారిస్తున్నారు. అశ్లీల రాకెట్ పై పలువురి వాంగ్మూలాలు రికార్డు చేశారు. ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. అశ్లీల రాకెట్ లో ప్రధాన ప్రమేయమున్న వారిని బెదిరించి తన పనులు కానిచ్చేవాడని చెబుతున్నారు. దీంతో రాజ్ కుంద్రా బాగోతం బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఇంకా అశ్లీల రాకెట్ ఎన్ని మలుపులు తిరుగుతోందని అందరిలో ఆసక్తి నెలకొంది.