Biker Glimpse: మీడియం రేంజ్ హీరోలలో ప్రస్తుతం డిజాస్టర్ ఫేస్ ని ఎదురుకుంటున్న వారిలో ఒకరు శర్వానంద్. ఒకప్పుడు వరుస హిట్స్ తో టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరో అని అనిపించుకున్న శర్వానంద్(Sharwanand), ఈమధ్య కాలం లో వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకుంటూ తన మార్కెట్ ని రిస్క్ లో పెట్టుకున్నాడు. అయితే ఇకపై చేసే ప్రతీ సినిమా విషయం లో జాగ్రత్తలు తీసుకోవాలి అని నిర్ణయించుకున్న ఆయన బాగా గ్యాప్ తీసుకొని మన ముందుకు ‘బైకర్'(Biker Movie) అనే చిత్రం ద్వారా వస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రీసెంట్ గానే శర్వానంద్ ఈ సినిమా కోసం సిక్స్ బాడీ ని పెంచిన ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. ఈ ఫోటోలను చూసి ఈసారి శర్వానంద్ గట్టిగానే కొట్టేలా ఉన్నాడు అని అనుకున్నారు ఆడియన్స్.
Also Read: ‘ఛాంపియన్’ టీజర్ లో శ్రీకాంత్ కొడుకు రోషన్ కుమ్మేసాడుగా…
ఇకపోతే కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేశారు. ఈ వీడియో కి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. వీడియో చూస్తున్నంతసేపు ఇది అసలు శర్వానంద్ సినిమా యేనా?, హాలీవుడ్ స్టాండర్డ్స్ తో తెరకెక్కించినట్టు ఉన్నారు అని అనిపించక తప్పదు. ఈమధ్య కాలం లో విడుదలైన ‘F1’ అనే హాలీవుడ్ మూవీ ని ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎగబడి చూసారు. మన ఇండియా లో కూడా ఈ సినిమా ఇప్పటికీ కొన్ని థియేటర్స్ లో రన్ అవుతోంది. అంతటి సంచలన విజయం సాధించింది ఈ చిత్రం. ‘బైకర్’ గ్లింప్స్ ని చూస్తుంటే, F1 తరహా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సినిమాని తెరకెక్కించినట్టుగా అనిపిస్తుంది. ఇందులో శర్వానంద్ కూడా చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేసినట్టుగా అనిపిస్తుంది.
మన సౌత్ లో ఇప్పటి వరకు బైక్ రేసింగ్ థీమ్ మీద ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాలేదు. ‘బైకర్’ సినిమా అలాంటి అరుదైన జానర్ లో తెరకెక్కింది. థియేటర్ లో కచ్చితంగా ఈ చిత్రం మంచి థ్రిల్లింగ్ అనుభూతి కలిగిస్తుందని గ్లింప్స్ వీడియో ని చూస్తే తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాణం మధ్యలో బడ్జెట్ సమస్యల కారణంగా చాలా సమస్యలు తలెత్తాయి. మధ్యలో సినిమా కూడా ఆగిపోయింది అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఎన్నో సవాళ్ళను ఎదురుకొని ఈ చిత్రం ఇప్పుడు పూర్తి అయ్యింది. డిసెంబర్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా ఆడియన్స్ ని నిజంగా థ్రిల్ కి గురి చేస్తే, కేవలం టాలీవుడ్ లోనే కాదు, పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రం క్లిక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే సీనియర్ హీరో రాజశేఖర్ ఇందులో శర్వానంద్ కి తండ్రి పాత్రలో నటించాడు. సోషల్ మీడియా ని షేక్ చేస్తున్న బైకర్ గ్లింప్స్ వీడియో ని ఎక్సక్లూసివ్ గా మీ కోసం అందిస్తున్నాము చూడండి.