https://oktelugu.com/

Bro Daddy Remake: చిరంజీవి కొడుకుగా రామ్ చరణ్ స్కూల్ మేట్..!

బ్రో డాడీ రీమేక్ లో చిరంజీవి కొడుకుగా శర్వానంద్ నటించడం ఖాయం అంటున్నారు. ఇక శర్వానంద్ చిరంజీవి ఫ్యామిలీ ఫ్రెండ్. రామ్ చరణ్ క్లాస్ మేట్. వీరిద్దరూ కలిసి చదువుకున్నారు. ఇప్పటికి కూడా చరణ్-శర్వానంద్ మంచి స్నేహం కొనసాగిస్తున్నారు.

Written By:
  • Shiva
  • , Updated On : August 4, 2023 / 12:14 PM IST

    Bro Daddy Remake

    Follow us on

    Bro Daddy Remake: హీరో రామ్ చరణ్ స్కూల్ మేట్ చిరంజీవి కొడుకు పాత్ర చేస్తున్నాడనే న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఈ మేరకు ఆసక్తి సమాచారం బయటకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి వరుస చిత్రాలతో హోరెత్తిస్తారు. ఏడాది వ్యవధిలో చిరంజీవి ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య చిత్రాలతో అలరించారు. వాల్తేరు వీరయ్య విడుదలైన ఏడు నెలలకు భోళా శంకర్ గా బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాడు. ఆగస్టు 11న భోళా శంకర్ థియేటర్స్ లో దిగనుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

    కాగా నెక్స్ట్ ఆయన మరో రీమేక్ ఎంచుకున్నట్లు సమాచారం. మలయాళ హిట్ మూవీ బ్రో డాడీ రీమేక్ లో నటిస్తున్నారట. బ్రో డాడీ మూవీలో మోహన్ లాల్, పృథ్విరాజ్ సుకుమారన్ నటించారు. ఈ పాత్రలను చిరంజీవి మరొక యంగ్ హీరో చేయనున్నారు. చిరంజీవి కొడుకు పాత్ర కోసం మొదట సిద్దు జొన్నలగడ్డను అనుకున్నారట. అయితే సిద్ధు అనుకోని కారణాలతో చేయడం లేదట. దీంతో ఈ ఆఫర్ శర్వానంద్ వద్దకు వెళ్ళిందంటున్నారు.

    బ్రో డాడీ రీమేక్ లో చిరంజీవి కొడుకుగా శర్వానంద్ నటించడం ఖాయం అంటున్నారు. ఇక శర్వానంద్ చిరంజీవి ఫ్యామిలీ ఫ్రెండ్. రామ్ చరణ్ క్లాస్ మేట్. వీరిద్దరూ కలిసి చదువుకున్నారు. ఇప్పటికి కూడా చరణ్-శర్వానంద్ మంచి స్నేహం కొనసాగిస్తున్నారు. తరచుగా కలుస్తుంటారు. కెరీర్ బిగినింగ్ లో శర్వానంద్ చిరంజీవి మూవీలో చిన్న పాత్ర చేశాడు. శంకర్ దాదా ఎంబిబిఎస్ మూవీలో లవ్ ఫెయిల్యూర్ తో డిప్రెషన్ కి గురైన కుర్రాడి రోల్ చేశాడు.

    మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత చిరంజీవి, శర్వానంద్ కలిసి సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్నారని వినికిడి. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. సోగ్గాడే చిన్నినాయనా ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. చిరంజీవికి జంటగా త్రిష నటిస్తుందట. గతంలో స్టాలిన్ మూవీలో వీరు జతకట్టారు. ఇక శర్వానంద్ కి జంటగా శ్రీలీలను ఎంపిక చేశారని సమాచారం. ఈ చిత్రాన్ని చిరంజీవి కూతురు సుస్మిత నిర్మించనున్నారు.