Vaishnavi Chaitanya : యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ, సినిమాల్లో హీరోయిన్ గా అడుగుపెట్టి పెద్ద స్థాయికి రావడం అనేది సాధారణమైన విషయం కాదు. ఎంతో మంది అలా ప్రయత్నం చేసి విఫలం అయ్యారు కానీ, వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) మాత్రం సక్సెస్ అయ్యింది. ఈమె ఒక పాపులర్ యూట్యూబర్ గా సోషల్ మీడియా ని ఉపయోగించే ప్రతీ ఒక్కరికి సుపరిచితమే. అలా ఒకపక్క షార్ట్ ఫిలిమ్స్ చేస్తూనే మరో పక్క సినిమాల్లో క్యారక్టర్ రోల్స్ కూడా చేస్తూ వచ్చింది. కానీ ఎప్పుడైతే షణ్ముఖ్ జస్వంత్(Shanmukh Jaswanth) తో కలిసి ‘సాఫ్ట్ వేర్ డెవలపర్’ అనే వెబ్ సిరీస్ చేసిందో, అప్పటి నుండి ఈమె రేంజ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళిపోయింది. ఆ వెబ్ సిరీస్ సంచలన విజయం సాధించడం తో వైష్ణవి చైతన్య కి ‘బేబీ’ మూవీ లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది.
Also Read : స్టేజి మీద వైష్ణవి చైతన్య బూతులు..కవర్ చేసిన హీరో సిద్ధు..వీడియో వైరల్!
హీరోయిన్ గా ఈ సినిమానే ఆమెకు మొదటి సినిమా. ఎంత పెద్ద కమర్షియల్ హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. యూత్ ఆడియన్స్ లో వైష్ణవి చైతన్య పేరు మారుమోగిపోయింది. ఎట్టకేలకు ఒక తెలుగు అమ్మాయి సక్సెస్ అయ్యింది అంటూ ఎంతో సంతోషించారు మన తెలుగోళ్లు. ఇకపోతే లేటెస్ట్ గా ఆమె సిద్దు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) తో కలిసి ‘జాక్ – కొంచెం క్రాక్'(Jack – Konchem Krack) అనే చిత్రం లో నటించింది. ఈనెల 10వ తారీఖున థియేటర్స్ లోకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ లో భాగంగా వైష్ణవి చైతన్య పలు ఇంటర్వ్యూస్ ఇచ్చింది. ఒక ఇంటర్వ్యూ లో ఆమె తానూ ఈ స్థాయికి చేరుకోవడానికి కెరీర్ లో ఎన్ని ఇబ్బందులు పడిందో చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. సినీ ఇండస్ట్రీ లో కొత్తగా అడుగుపెట్టే అమ్మాయిల పరిస్థితి ఇలా ఉంటుందా అని అనుకుంటున్నారు.
ఆమె మాట్లాడుతూ ‘చిన్నతనం నుండి నేను ఒక నటిని అవ్వాలని ఎప్పుడూ కోరుకోలేదు. కానీ మా నాన్న, తాతయ్యలకు సినిమాలంటే పిచ్చి. వాళ్ళ కారణంగానే నాకు సినిమాలపై ఆసక్తి కలిగింది. జీవితం లో ఏదైనా తొందరగా దొరికితే కిక్ ఉండదు. కష్టపడితేనే సంతృప్తి కలుగుతుంది. నేను కూడా కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులను ఎదురుకున్నాను. ఒకపక్క ఉద్యోగం చేస్తూనే మరోపక్క షార్ట్ ఫిలిమ్స్, సినిమాలు చేస్తూ ఉండేదానిని. సినిమాల్లో అవకాశాలు రావడమో మొదలైనప్పుడు, ఈ రంగంలో రాణిస్తాను అనే నమ్మకం కలిగింది. అలా నా ప్రయాణం మొదలై ఇక్కడి వరకు వచ్చింది. యూట్యూబర్స్ కి కెరీర్ అంత సులువుగా ఉండదు. గొప్ప గొప్ప కంటెంట్స్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది కానీ, అందుకు బడ్జెట్ సహకరించదు. నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న సమయంలో రూమ్స్ దొరకక పార్కుల్లో, వాష్ రూమ్స్ లో బట్టలు మార్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి’ అంటూ చెప్పుకొచ్చింది వైష్ణవి చైతన్య.
Also Read : బాత్ రూమ్ లోనే ఆ పని చేయడం చూసి అమ్మ బాధపడింది… బేబీ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్