Shanmukh Jaswanth Girlfriend: యూట్యూబ్ లో లక్షలాది మంది ఫాలోవర్స్ ని సొంతం చేసుకొని స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్న వారిలో ఒకరు షణ్ముఖ్ జస్వంత్(Shanmukh Jaswanth). వైవా అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా పరిచయమైనా ఇతను, ఆ తర్వాత యూట్యూబ్ లో ఎన్నో వందల షార్ట్ ఫిలిమ్స్ లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని సంపాదించాడు. అలా ముందుకెళ్తున్న షణ్ముఖ్ జస్వంత్ కెరీర్ ని మలుపు తిప్పిన వెబ్ సిరీస్ ‘సాఫ్ట్ వేర్ డెవలపర్’. యూట్యూబ్ లో అప్పట్లో వెబ్ సిరీస్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ వెబ్ సిరీస్ తో ఎక్కడికో వెళ్లిపోయిన షణ్ముఖ్ జస్వంత్, సూర్య అనే మరో వెబ్ సిరీస్ తో మరో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. సాఫ్ట్ వేర్ డెవలపర్ లో హీరోయిన్ గా నటించిన వైష్ణవి చైతన్య ఇప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎలాంటి రేంజ్ లో ఉందో మనమంతా చూస్తూనే ఉన్నాం.
షణ్ముఖ్ జస్వంత్ కూడా త్వరలో హీరో గా వెండితెర కి పరిచయం కాబోతున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ లో ఆయన ఫుల్ బిజీ గా ఉన్నాడు. ఇదంతా పక్కన పెడితే ఒకప్పుడు షణ్ముఖ్ జస్వంత్ పేరు వినిపిస్తే, మనకు వెంటనే గుర్తుకు వచ్చే మరో పేరు దీప్తి సునైనా. వీళ్లిద్దరు ప్రేమికులుగా ఎన్నో ఏళ్ళ పాటు కొనసాగారు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ 5 లోకి షణ్ముఖ్ జస్వంత్ వచ్చాడో, అప్పుడే వీళ్లిద్దరి రిలేషన్ మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు ఇతను సిరి హన్మంత్ అనే అమ్మాయితో చేసిన రొమాన్స్ అప్పట్లో ఒక సెన్సేషన్. షణ్ముఖ్ సైలెంట్ గానే ఉన్నప్పటికీ, ఆ అమ్మాయే ఇతనికి ముద్దులు పెట్టడం, హగ్గులు ఇవ్వడం వంటివి ప్రారంభించడం తో, ఈయన కూడా అదే ఫ్లో లో కొనసాగిపోయాడు.
ఫలితంగా బయటకు వచ్చిన తర్వాత దీప్తి సునైనా షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పేసింది. అప్పటి నుండి సోలో గానే ఉంటూ వస్తున్న షణ్ముఖ్, నేడు మరోసారి రిలేషన్ లో పడ్డాను అంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్టు ద్వారా తన ప్రేయసి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ, కొన్ని ఫోటోలు అప్లోడ్ చేసాడు. ఆమె ముఖాన్ని చూపించలేదు, ఆమె పేరు కూడా చెప్పలేదు. ఆమె పేరు V అనే అక్షరం తో మొదలు అవుతుంది అనే హింట్ మాత్రమే ఇచ్చాడు. మరి రాబోయే రోజుల్లో అయినా తన ప్రేయసి పేరు ని, ముఖాన్ని రివీల్ చేస్తాడో లేదో చూడాలి. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఈ ఫోటోలను మీరు కూడా చూసేయండి.