YouTuber Anvesh: హిందూ దేవుళ్ళు పై ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చేసి , తీవ్రమైన ప్రజావ్యతిరేకతను ఎదురుకుంటున్న ప్రముఖ యూట్యూబర్ అన్వేష్(Naa Anveshana), ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఎవరికైనా నవ్వు రాక తప్పదు. ఇతను చేసిన వ్యాఖ్యల కారణంగా రోజుకి 40 వేలమంది Subscribers ఇతని ఛానల్ నుండి మైనస్ అయిపోతూ వస్తున్నారు. అంతే కాకుండా పోలీసులు కూడా ఈసారి తనని కచ్చితంగా పెట్టుకునేలా ఉన్నారు అనే భయం తో కాసేపటి క్రితమే ఇతను విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా బాగా వైరల్ అయ్యింది. కానీ ఎన్ని వీడియోలు చేసిన, ఇతను ఎన్ని మాట్లాడిన జనాలు ఇక ఇతని మాటలను పట్టించుకునే పరిస్థితి లో లేరు. సాధ్యమైనంత త్వరగా అతన్ని ఇండియా కి తీసుకొచ్చి జైలు ఊచలు లెక్కపెట్టించే వరకు జనాలు శాంతించేలా లేరు.
ఇప్పటికే ఒకసారి క్షమాపణలు చెప్తూ వీడియో చేసాడు అన్వేష్. ఆ క్షమాపణలు కూడా తన విపరీత బుద్ధి నిదర్శనంగా నిల్చింది అంటూ చెప్పుకొచ్చారు నెటిజెన్స్. ఆ వీడియో వర్కౌట్ అవ్వకపోవడం తో ఇప్పుడు మరో వీడియో లో ‘నాకు నిన్న రాత్రి ఆంజనేయ స్వామి, విష్ణు మూర్తి కలలోకి వచ్చారు, ఇకపై బూతులు మాట్లాడకుండా ప్రజా సమస్యలపై పోరాటం చెయ్యాలని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో బత్తాయి రంగులో ఉన్నటువంటి కాషాయవస్త్రం , మతం మత్తులో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయని, ఆడవాళ్లపై మృగాలా అకృత్యాలు హద్దులు దాటుతున్నాయని, ఆడవాళ్లకు అండగా నిలబడి పోరాటం చెయ్యాలని నాకు విష్ణు మూర్తి కలలో చెప్పాడు . విష్ణు మూర్తి పై ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇక మీదట బూతులు మాట్లాడను’ అంటూ చెప్పుకొచ్చాడు అన్వేష్. దీనిపై నెటిజెన్స్ మండిపడుతూ, ఇంకెన్నాళ్లు దేవుడి పేరు ని ఉపయోగించుకొని ఇలాంటి పనికిమాలిన వీడియోలు చేస్తావు, నీకు అసలు బుద్ధి రాదా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
స్వచ్ఛమైన మనస్సు ఉన్నవాళ్ళకి దేవుడి దర్శనం ప్రాప్తి సులువు కాదు, అలాంటిది ఆడవాళ్లను దూషించే నీకు దేవుడు కలలో దర్శనమిచ్చాడా?, మేము మీ కంటికి ఎలా కనిపిస్తున్నాము?, అగ్ని సమానురాలైన సీత దేవిపై నోటికొచ్చినట్టు మాట్లాడిన నీతో, విష్ణు మూర్తి మాట్లాడాడా?, నువ్వు ఏమైనా రామదాసు, అన్నమయ్య అనుకుంటున్నావా?, ఈ వీడియో కూడా నువ్వు దేవుడి పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ చేసినట్టుగానే ఉంది కానీ, ఎక్కడా కూడా పశ్చాత్తాపం పడుతున్నట్టు లేదు. నీ యూట్యూబ్ ఛానల్ ని ఎక్కడ బ్యాన్ చేస్తారో అనే భయం తో పిచ్చి వాడిలాగా మాట్లాడుతున్నావు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో ఈ క్రింది వీడియో లో చూసి తెలుసుకోండి.