NTR Prashanth Neel Movie : నందమూరి ఫ్యామిలీ మూడోతరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు జూనియర్ ఎన్టీఆర్…స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన వరుస సినిమాలు చేస్తూ సక్సెసుల పరంపరను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా నేపథ్యంలో స్టార్ హీరోలందరు వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ సైతం భారీ కాన్సెప్ట్ లతో సినిమాలను చేసి సూపర్ సక్సెస్ సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు…ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ వ్యవహరిస్తున్నాడు విశేషం…ప్రస్తుతం ఆయన డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు… ఇప్పటివరకు ఆయన ఎన్ని సినిమాలు చేసిన కూడా అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ సక్సెస్ గా నిలుస్తున్నాయి. కానీ ఇండస్ట్రీ హిట్ గా మాత్రం కన్వర్ట్ కావడం లేదు. నిజానికి ఆయన సినిమాలను ప్రేక్షకులు రిపిటెడ్ గా చూడటం లేదు.
అందుకనే ఆయన ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకోలేకపోతున్నాడు అంటూ ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కి వచ్చిన సమస్య ఏంటి అంటే అతని సినిమాలు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నప్పటికి ఆయన సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా అలరించడం లేదని ఒక సర్వేలో అయితే తెలిసింది.
మరి దాని ప్రకారం ఆయన ప్రేక్షకులందరిని అలరించే విధంగా మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తే బాగుంటుంది. అలాగే ఆ సినిమా ప్రతి ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయగలగాలి అలా చేసినప్పుడు మాత్రమే ప్రేక్షకుడు సినిమా థియేటర్ కి వస్తాడని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ రాబోయే సినిమాల్లో వీటి మీద శ్రద్ధ తీసుకొని సినిమా చేస్తే బాగుంటుందని అలాగైతేనే ఆయనకి ఇండస్ట్రీ హిట్లు దక్కుతాయి అంటూ పలువురు సినిమా క్రిటిక్స్ సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు… ఇక ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయంలో క్లారిటీ అయితే లేకుండా పోయింది…