Shanmukh
Shanmukh : షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సోషల్ మీడియా లో ఒక రేంజ్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న వ్యక్తి షణ్ముఖ్ జస్వంత్. ‘వైవా’ అనే షార్ట్ ఫిలిం ద్వారా మొట్టమొదటిసారి ఈయన మన ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. ఆ చిత్రం తర్వాత ఈయన అదే సంస్థలో ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేసాడు. ఆ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ ని స్థాపించి యూత్ ఆడియన్స్ కి దగ్గరయ్యేలా ఎన్నో అద్భుతమైన షార్ట్ ఫిలిమ్స్ చేసి మంచి ఫ్యాన్ బేస్ ని దక్కించుకున్నాడు. అలా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా వచ్చిన క్రేజ్ తో ఈయనకి బిగ్ బాస్ సీజన్ 5 రియాలిటీ షోలో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం దక్కింది. విన్నర్ అవ్వాల్సిన ఈయన హౌస్ లో పెట్టుకున్న కొన్ని రిలేషన్స్ కారణంగా రన్నర్ గా మిగిలిపోయాడు. ఎవరికైనా బిగ్ బాస్ షో కెరీర్ ని మరో మెట్టు ఎక్కిస్తుంది.
కానీ షణ్ముఖ్ విషయంలో మాత్రం బిగ్ బాస్ షో ఒక పీడకల. ఈ షోలో సిరి హన్మంత్ అనే అమ్మాయితో ఆయన నడిపిన ప్రేమాయణం వల్ల తన వ్యక్తిగత జీవితం లో ఉన్న ప్రేయసి దీప్తి సునైనా ఇతనికి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. బిగ్ బాస్ షో నుండి బయటకి వచ్చిన తర్వాత ఈయన చేసిన షార్ట్ ఫిలిమ్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అంతకు ముందు ఈయన చేసిన ‘సాఫ్ట్ వేర్ డెవలపర్’, ‘సూర్య’ వంటి వెబ్ సిరీస్ లు సంచలన విజయాలు సాధించాయి. యూత్ అప్పట్లో ఈ సిరీస్ ని ఎగబడి చూసారు. షణ్ముఖ్ కి కూడా మంచి క్రేజ్ వచ్చింది. కానీ బిగ్ బాస్ తర్వాత ఇతని జీవితం తలక్రిందులు అయ్యింది. ఈమధ్య కాలం లోనే ఒక అమ్మాయి ఇతనిపై కేసు వేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా గంజాయి కేసు లో కూడా చిక్కుకున్నాడు.
ఇప్పుడిప్పుడే మళ్ళీ కెరీర్ లో ఆయన నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్ గానే ఆయన ‘లీలా వినోదం’ అనే సినిమా చేసాడు. ఈ చిత్రం ఈనెల 19 వ తారీఖున ఈటీవీ విన్ యాప్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మూవీ టీం ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో షణ్ముఖ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘వైజాగ్ లో ఉండే నేను, సినిమాల మీద ఇష్టం తో, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా యూట్యూబ్ ఛానల్ ని స్థాపించి షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ ద్వారా జనాలకు దగ్గరయ్యాను. కెరీర్ లో నిలదొక్కుకుంటున్న సమయంలో నేను చెయ్యని తప్పుకి నా జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసారు. ఇంట్లో నేనొక్కడినే సంపాదించేవాడిని. అమ్మానాన్నలను నేనే చూసుకోవాలి. ఎట్టకేలకు మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తూ ‘లీలా వినోదం’ చిత్రం ద్వారా మీ ముందుకు వస్తున్నాను’ అంటూ షణ్ముఖ్ జస్వంత్ ఎమోషనల్ గా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.