Prabhas and Allu Arjun : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంతకు ముందు ఎప్పుడు లేనటువంటి పెను రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. మరి దానికి గల కారణం ఏంటి అంటే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప 2’ సినిమా పెను ప్రభంజనాలను సృష్టించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని ఆకట్టుకుంటుంది. బాలీవుడ్ లో అయితే ఈ సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతుందనే చెప్పాలి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సైతం ‘పుష్ప 2’ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ని కూడా సంపాదించుకున్నాడు. ఇక ఇప్పటివరకు ఈ సినిమా దాదాపు 1500 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే… ఇక ఈ దెబ్బతో పాన్ ఇండియాలో ఉన్న అన్ని రికార్డులు కూడా బ్రేక్ అవుతూ సరికొత్త రికార్డు లను క్రియేట్ చేస్తున్నాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమా ఈ సంవత్సరం రిలీజ్ అయి 1300 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇక ఆ రికార్డులను కూడా అల్లు అర్జున్ బ్రేక్ చేసి ముందుకు సాగుతూ ఉండడం విశేషము…మరి ఇప్పుడు ప్రభాస్ సాధించిన బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేయడానికి అల్లు అర్జున్ చాలా ఆసక్తి చూపిస్తున్నాడు. మరి పుష్ప 2 సినిమాతో బాహుబలి 2 సినిమా రికార్డు బ్రేక్ అవుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటివరకైతే ఈ సంవత్సరం ప్రభాస్ క్రియేట్ చేసిన పెను ప్రభంజనాన్ని బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డు క్రియేట్ చేయడమే కాకుండా ఈ ఇయర్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమా గా పుష్ప 2 నిలిచిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా పెను ప్రభంజనాలను క్రియేట్ చేస్తుందని ట్రేడ్ పండితులు సినిమా రిలీజ్ కి ముందే అంచనా వేశారు. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా కలెక్షన్ల సునామిని సృష్టిస్తూ ముందుకు సాగడం ప్రతి ఒక్కరిని ఆనందానికి గురిచేస్తుంది…
మరి పుష్ప 2 సినిమా లాంగ్ రన్ ఎలాంటి రికార్డును క్రియేట్ చేస్తుంది. బాహుబలి క్రియేట్ చేసిన మేనియాను తుడిచి పెట్టేస్తుందా? దంగల్ సినిమా రికార్డును కూడా బ్రేక్ చేసి ముందుకు సాగుతుందా అనేది తెలియాల్సి ఉంది…
ఇక ఏది ఏమైనా కూడా ఒక తెలుగు సినిమా ఇప్పుడు పాన్ ఇండియా రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా మనందరం గర్వపడాల్సిన విషయమనే చెప్పాలి… ఇక ఏది ఏమైనా కూడా భారీ సక్సెస్ ని సాధించడానికి ఇటు అల్లు అర్జున్, అటు సుకుమార్ చాలా వరకు కష్టపడ్డారనే చెప్పాలి…