Game Changer: ఇండియా లో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా ఉండవలసిన పేరు శంకర్ . భారీ సినిమాలు పెట్టింది పేరైన ఆయన నుండి సినిమా వస్తుందంటే అందరి దృష్టి ఆ సినిమా మీద ఉంటుంది.. సామాజిక అంశాలకు భారీ కమర్షియల్ జోడించి తెర మీద అద్భుతాలు సృష్టించిన ఘనాపాటి శంకర్. ఈ మధ్య ఆయన సినిమాలు అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయిన కానీ ఆయన మార్క్ మాత్రం ఎక్కడా మిస్ కాలేదు.
ప్రస్తుతం ఒకేసారి రెండు సినిమాలను తెరకెక్కిస్తున్నాడు శంకర్. బహుశా ప్రస్తుతం ఇండియాలో టాప్ దర్శకుల్లో ఒకేసారి రెండు భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్న భారీ దర్శకుడు శంకర్ మాత్రమే కావచ్చు. కమలహాసన్ హీరోగా తెరకెక్కుతున్న ఇండియన్ 2 ఒక పక్క , అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మరోపక్క సమాంతరంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.
ముందుగా మొదలైన ఇండియన్ 2 సినిమాను త్వరగానే ప్రేక్షకుల ముందుకు తీసుకుని రాబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం ఆ ఆలోచన ను మార్చుకొని 2024 ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15 కి తీసుకొని రావాలని భావిస్తున్నారు. ఇండియన్ 2 కి ఆ తేదీ నే పర్ఫెక్ట్ అని భావిస్తున్నారు శంకర్. ఇక రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ను వచ్చే ఏడాది సమ్మర్ కి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అన్ని అనుకున్నట్లు జరిగితే 2024 మార్చి మూడు లేదా నాలుగో వారంలో గేమ్ ఛేంజర్ విడుదల అయ్యే అవకాశం మెండుగా ఉన్నాయి. దానికి తగ్గట్లే షూటింగ్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది. మొన్న ఒక ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ అందరికి గేమ్ ఛేంజర్ అప్డేట్ గురించి తెలుసుకోవాలని ఉంది. కానీ నా చేతిలో ఏమీ లేదు దర్శకుడు నుంచి వస్తే నేను చెప్పగలను. విడుదల తేదీ అనేది శంకర్ మాత్రమే ఫిక్స్ చేస్తారంటూ చెప్పుకొచ్చాడు. వెంకటేశ్వర క్రియేషన్స్ లో 50 వ సినిమాగా ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు దిల్ రాజు .