Rahul Gandhi : G-20 ఘనతకు ప్రతిగా భారత్ ప్రతిష్టను దెబ్బతీయాలనా?

G-20 ఘనతకు ప్రతిగా భారత్ ప్రతిష్టను దెబ్బతీయాలనుకుంటున్న దానిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : September 9, 2023 6:19 pm

Rahul Gandhi  : దేశంలో ఘనంగా జీ20 సమావేశాలు జరుగుతున్నాయి. ప్రపంచ దేశాధినేతలంతా కూడా భారత్ కు వచ్చి ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. ఇలాంటి సమయంలో రాహుల్ గాంధీ ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్నారు. జీ20 సమావేశాలు భారత్ లో జరుగుతూ భారత్ ప్రతిష్ట పైపైకి వెళ్లిపోతోంది. ఈ ఈ తరుణంలో రాహుల్ యూరప్ వెళ్లి భారత్ లో ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. చైనాకు విజన్ ఉంది. భారత్ కు విజన్ లేదు. వినడానికే అసహ్యం వేసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.

దేశ ప్రజలు, నేతలూ అందరూ ఈ టైంలో సంతోషపడాలి. అమెరికా, బ్రిటన్ సహా ప్రపంచ దేశాధినేతలు అందరూ జీ20 సమావేశానికి భారత్ కు రావడం గర్వకారణం అని చెప్పొచ్చు. భారత్ ను ప్రతీ దేశం ఇంత గొప్పగా కీర్తిస్తూ ఉంటే.. నువ్వు భారత్ గురించి ఇలా బయటకు వెళ్లి ఈ టైంలో కాన్వాస్ చేయడంలో అర్థముందా? అన్నది ఆలోచించాలి.

యూరప్ లో శ్యాంపెట్రోడా అనే వ్యక్తి ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పేరుతో రాహుల్ తో ఈ సమావేశాలు ఏర్పాటు చేసి భారత్ పై విషం కక్కుతున్నాడు. G-20 ఘనతకు ప్రతిగా భారత్ ప్రతిష్టను దెబ్బతీయాలనుకుంటున్న దానిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.