https://oktelugu.com/

Shankar : 5 సెకండ్ల సీన్ కి 5 కోట్లు ఏంటి సామి…శంకర్ పిచ్చి పరాకాష్టకు చేరిందా..?

Shankar : సినిమా ఇండస్ట్రీ లో భారీ బడ్జెట్ పెట్టి పెద్ద హీరోలతో విజువల్ వండర్ గా తెరకెక్కించడం వల్ల సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడమే కాకుండా భారీ కలెక్షన్స్ కి తీసుకొస్తుందనే ఒక నమ్మకంతో ఇప్పుడున్న దర్శక నిర్మాతలు భారీ బడ్జెట్ సినిమాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు...

Written By: , Updated On : March 26, 2025 / 11:40 AM IST
Shankar

Shankar

Follow us on

Shankar : సినిమా ఇండస్ట్రీ లో భారీ బడ్జెట్ పెట్టి పెద్ద హీరోలతో విజువల్ వండర్ గా తెరకెక్కించడం వల్ల సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడమే కాకుండా భారీ కలెక్షన్స్ కి తీసుకొస్తుందనే ఒక నమ్మకంతో ఇప్పుడున్న దర్శక నిర్మాతలు భారీ బడ్జెట్ సినిమాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు… ఇక అందులో భాగంగానే శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ మొదటి నుంచి కూడా భారీ బడ్జెట్ సినిమాలకే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ వస్తున్నాడు. అయితే గత పది సంవత్సరాల నుంచి ఆయన చేసిన సినిమాలేవి పెద్దగా సక్సెస్ సాధించకపోవడంతో ఆయన సినిమాల పట్ల ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇక గత సంవత్సరం భారతీయుడు 2 (Bharathiyudu 2)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించినప్పటికి ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో శంకర్ మార్కెట్ భారీగా తగ్గిపోవడమే కాకుండా ‘భారతీయుడు 2’ సినిమా నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చింది. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఈ సినిమాలో ఒక ఐదు సెకండ్ల సీన్ కోసం 5 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టించాడనే టాక్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా నడుస్తుంది.

Also Read : భారతీయుడు 3 ఆగిపోయిందా..? కమల్ హాసన్ కి శంకర్ వైఖరి నచ్చడం లేదా..?

నిజానికి శంకర్ సినిమా అంటే గ్రాండీయర్ తో కూడుకొని ఉంటుంది. కాబట్టి ఆయన సినిమాలు చేయడానికి నిర్మాతలు ఒకరకంగా సాహసం చేయాల్సిందే. ఎందుకంటే ఆయన డబ్బులను మంచినీళ్ల మాదిరిగా ఖర్చుపెట్టిస్తూ ఉంటాడు. ఇక సినిమా సూపర్ సక్సెస్ అయితే అంతకుమించి వసూళ్లను రాబడుతూ ఉంటాయి.

కానీ ఒకవేళ డిజాస్టర్ బాట పడితే మాత్రం ప్రొడ్యూసర్స్ కి విపరీతంగా నష్టాలైతే మిగిలుస్తు ఉంటాయి. ‘భారతీయుడు 2’ సినిమాలో విలన్ గా నటించిన ఎస్ జె సూర్య ఇంటిని చూపించడానికి ఐదు కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారట. కేవలం ఈ సన్నివేశం సినిమాలో ఐదు సెకండ్లు మాత్రమే ఉంటుంది. అయితే గ్రాండియర్ తో కూడిన అతని ఇల్లు అలాగే ఆ ఇంట్లో ఉండే వాటన్నింటిని చూపించడానికి ఐదు కోట్లు పెట్టి మరి ఆ ఇంటి సెట్ ను వేయించి అందులో కొన్ని ఖరీదైన వస్తువులను సైతం ఏర్పాటు చేశారట.

మరి మొత్తానికైతే శంకర్ గ్రాండియర్ గా చూపించాలనే పిచ్చి రోజు రోజుకి మరింత ఎక్కువైపోతుంది అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి ప్రతి విషయాన్ని నొక్కి పట్టి చెబుతున్నారు. అదే సినిమా సక్సెస్ అయి ఉంటే వీటన్నింటిని పట్టించుకునేవారు కాదు కదా అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం శంకర్ కి సపోర్టుగా మాట్లాడుతున్నారు…

Also Read : శంకర్ దెబ్బకు సినీ ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోయిన ‘లైకా ప్రొడక్షన్స్!