Homeఎంటర్టైన్మెంట్Shambhala Trailer Review: 'శంబాల' ట్రైలర్ బాగుంది...కానీ ఆ ఒక్క మైనస్ తెలిసిపోతోంది...

Shambhala Trailer Review: ‘శంబాల’ ట్రైలర్ బాగుంది…కానీ ఆ ఒక్క మైనస్ తెలిసిపోతోంది…

Shambhala Trailer Review: నటుడు సాయికుమార్ కొడుకు ఆది సాయికుమార్ హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. కెరియర్ స్టార్టింగ్ లో ‘ప్రేమ కావాలి’, లవ్లీ లాంటి సినిమాలతో హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకున్న ఆది ఈ మధ్యకాలంలో వరుస సినిమాలు చేస్తున్నప్పటికి అవేవి అతనికి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి… ఇక ఈనెల 25వ తేదీన క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘శంబాల’ సినిమా మీదనే అతను పూర్తి […]

Shambhala Trailer Review: నటుడు సాయికుమార్ కొడుకు ఆది సాయికుమార్ హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. కెరియర్ స్టార్టింగ్ లో ‘ప్రేమ కావాలి’, లవ్లీ లాంటి సినిమాలతో హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకున్న ఆది ఈ మధ్యకాలంలో వరుస సినిమాలు చేస్తున్నప్పటికి అవేవి అతనికి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి… ఇక ఈనెల 25వ తేదీన క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘శంబాల’ సినిమా మీదనే అతను పూర్తి కాన్ఫిడెంట్ పెట్టుకున్నాడు… ఇక ఈ సినిమా గ్లింప్స్ నుంచి కూడా ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ క్రియేట్ చేస్తూ వచ్చింది. గత కొద్దిసేపటికి క్రితమే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. అది చూస్తుంటే సినిమా మీద అంచనాలుతార స్థాయికి చేరిపోయాయి. ప్రతి షాట్ కూడా డిఫరెంట్ వే లో ప్రజెంట్ చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే ఆది సాయికుమార్ ఈ మధ్యకాలంలో ఏ సినిమాలో నటించని విధంగా ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించినట్టుగా తెలుస్తోంది. దర్శకుడు ఈ సినిమా పాయింట్ నుంచి చాలా స్ట్రెయిట్ గా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశాడనే విషయమైతే మనకు ట్రైలర్ ను చూస్తే అర్థమవుతోంది.

ఈ సినిమా కథ కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. మూఢనమ్మకాలను నమ్మే ప్రజల్లో హీరో ఎలా చైతన్యం తీసుకొచ్చాడు. అసలు ఆ ఊరు ను పట్టి పీడిస్తున్నది ఎవరు? కావాలనే కొంతమంది జనాల్లో భయాన్ని పుట్టిస్తున్నారా? అనేది తెలుపడానికి ఈ సినిమాను డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రతి సీన్లో ఒక ఇంటెన్స్ కనిపించబోతున్నట్టుగా అర్థమవుతోంది.

ఈ సినిమాలో విజువల్స్ కొంతవరకు బాగున్నప్పటికి ఇంకాస్త గ్రాండీయార్ జోడిస్తే బాగుండేది. ఆ విజువల్స్ లో క్వాలిటీ సిజీ వర్క్ అక్కడక్కడ తెలిసిపోతోంది. కానీ తమకున్న బడ్జెట్ పరిధిలో సినిమాని బాగా తీసినట్టుగా అర్థమతోంది. ట్రైలర్ లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది.

ఈ సినిమా ఈ 25వ తేదీన ప్రేక్షకులను మెప్పిస్తుందంటూ ప్రతి ఒక్కరు చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమాతో ఆది సాయికుమార్ గొప్ప సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది…అది తో పాటు ఇండస్ట్రీ కి వచ్చిన ప్రతి ఒక్క హీరో గొప్ప విజయాలను సాధిస్తుంటే ఆయన మాత్రం ఇంకా ఒక్క సక్సెస్ సాధించడానికి ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి ఈ సినిమా తను అనుకున్న సక్సెస్ ను అందిస్తుందా లేదా అనేది చూడాలి….

 

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper