Shambhala A Mystical World Trailer Review : చాలా మంది హీరోలు ఒక్క సక్సెస్ కోసం విపరీతంగా కష్టపడుతున్నారు…కొందరికి సక్సెస్ లు వస్తే మరికొంతమందికి ప్లాపులు వస్తున్నాయి…కారణం ఏదైనా కూడా వాళ్ళు ఎంచుకుంటున్న కథల్లో చాలా వరకు లోపం ఉంటుంది…ఇక మొదటి రెండు సినిమాలతో సత్తా చాటిన ఆది సాయి కుమార్ సైతం ఆ తర్వాత చేసిన చాలా సినిమాలతో ప్లాప్ లను మూటగట్టుకున్నాడు. ఇప్పుడు ‘శంభల’ సినిమాతో మరో సారి సక్సెస్ ను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు…
ఇక ఈ సినిమా డిసెంబర్ 25 క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో గత కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది…ఇక ఈ ట్రైలర్ స్టార్టింగ్ లోనే పురాణాలను టచ్ చేస్తూ కొన్ని వేల సంవత్సరాల క్రితం పరమ శివుడికి – అసురుడికి మధ్య జరిగిన ఒక యుద్ధంలో నుంచి ఒక బండ ఆకారంలో ఉన్న ఒక శక్తి నెల మీద వెలిసింది…దాని వల్ల ఆ ఊరిలో చాలా అనర్థాలు జరుగుతుంటాయి…దానికి సొల్యూషన్ ఏంటో చెప్పడానికే హీరో ఆ ఊరు వెళ్తాడు…
అనే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ట్రైలర్ స్టార్ చేశారు…ఈ ట్రైలర్ ను బట్టి చూస్తే ఇదొక మిస్టీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ గా తెలుస్తోంది…డైరెక్టర్ మేకింగ్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది…సినిమా కంటెంట్ లో భాగంగానే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది…విజువల్స్ కూడా ఆది గత సినిమాలతో పోలిస్తే బాగున్నాయి…ఇక ఈ మూవీ లో హీరో ప్రతి చర్య వెనక సైన్స్ ఉంటుంది అని నమ్ముతాడు…కానీ సైన్స్ కి అందని ఒక శక్తి ఉందని అదేంటో తెలుసుకోవడానికి ఆయన పడే స్ట్రగుల్ చాలా గొప్ప గా ఉంటుందనే విషయమైతే మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది…
ఈ ట్రైలర్ చూస్తుంటేనే ఒక ఫుల్ లెంత్ థ్రిల్లర్ సినిమాను చూస్తున్న ఫీల్ కలుగుతోంది… లాస్ట్ షాట్ లో కూడా హార్రర్ గొలిపే సన్నివేశంతో ట్రైలర్ ను ఎండ్ చేశారు…ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తె కొన్ని షాట్స్ కన్ఫ్యూజన్ ను కలిగిస్తున్నాయి…సినిమా సోల్ ను రెప్రజెంట్ చేయడంలో అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు…ఇక సినిమా వస్తే కానీ ఈ మూవీ ఏ రేంజ్ సక్సెస్ ను అందుకుంటుంది అనేది తెలియదు…