Shambhala Movie First Review: ‘ఆది సాయికుమార్ హీరోగా వచ్చిన చాలా సినిమాలు డిజాస్టర్ల బాటపడుతున్నాయి. వరుసగా ఆయన సినిమాల మీద సినిమాలు చేసిన కూడా అవేవి అతనికి కలిసి రావడం లేదు. ప్రస్తుతం ఆయన చేసిన ‘శంభాల’ సినిమా మాత్రం అతనికి సూపర్ సక్సెస్ ని అందిస్తుందని చాలా నమ్మకంతో ఉన్నాడు… ఈ కంటెంట్ బాగుండడంతో మొదటి నుంచి కూడా ఆయన ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక డైరెక్టర్ ఈ మూవీ ని ఎలా తెరకెక్కించాడు అనేది తెలియాల్సి ఉంది. ఈనెల 25వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది సినిమా పెద్దలకు ఈ సినిమాకు సంబంధించిన ప్రివ్యూస్ వేశారు…అది చూసిన ఇండస్ట్రీ పెద్దలు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేశారు. దాన్నిబట్టి ఈ సినిమా ఫస్ట్ రివ్యూ ఎలా ఉంది అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ఒక ఊరిలో కొన్ని మిస్టీరియస్ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటిని బేస్ చేసుకుని ఊరి జనాలు అంతా ఊర్లో ఏదో జరుగుతోంది. కొద్దిరోజుల్లో ఈ ఊరు అంత మవ్వబోతుంది అనే ఒక మూఢనమ్మకంలో బతికేస్తుంటారు. ఇక అదే సమయంలో హీరో అక్కడికి ఎంట్రీ ఇచ్చి ఆ ఊర్లో అసలు ఏం జరుగుతోంది. శివుడు అనే వాడు ఉన్నాడా? ఎందుకని ఈ ఊరు ఇలా అల్లాకల్లోలంగా మారుతుంది అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. నాస్తీకుడైన హీరోకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఆ ఊరిలో ఏం జరుగుతోంది అనే విషయాలను హీరో కనిపెట్టాడా? లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
డైరెక్టర్ మొదటి నుంచి కూడా ఈ సినిమాని సస్పెన్స్ థ్రిల్లర్ గానే మలిచాడు. ఫస్ట్ సీన్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా చివరి వరకు కూడా అదే టెంపో ను మైంటైన్ చేస్తూ ముందుకు సాగడం విశేషం ఇక గ్రాఫ్ ని సైతం ఎక్కడికక్కడ పెంచుతూ తగ్గిస్తూ ముందుకు తీసుకెళ్లిన దర్శకుడు సినిమాని హై వోల్టేజ్ సన్నివేశాలతో రక్తి కట్టించే ప్రయత్నం చేశాడు. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకుడికి థ్రిల్ ను ఇస్తోంది.
అలాగే సెకండాఫ్ మొత్తం ఒక టెంపోలో మెయింటైన్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాడు. క్లైమాక్స్ ట్విస్ట్ కి ప్రేక్షకుల మతి పోతుందనే చెప్పాలి… డైరెక్టర్ ఈ సినిమాలో థ్రిల్లింగ్ అంశాలు ఎక్కువగా ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నాడు. అందువల్లే ఈ సినిమా పెర్ఫెక్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చింది… మ్యూజిక్ లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి చాలా బాగా హెల్ప్ అయింది. ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులకు చెరువు చేయడంలో మ్యూజిక్ చాలా వరకు హెల్ప్ అయింది…
విజువల్స్ కూడా బాగున్నాయి అక్కడక్కడ సీజీ వర్క్ కొంతవరకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ కానట్టు అనిపిస్తున్నప్పటికి సినిమా అయితే ఓవరాల్ గా ఒక ఫీల్ తీసుకొచ్చిందని ప్రతి ఒక్క సినిమా సెలబ్రిటీ ఈ సినిమా గురించి చెబుతుండడం విశేషం…ఇక ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు అనేది తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే…