Shalini Pandey: కొంతమంది హీరోయిన్స్ కి మంచి ఆరంభం దొరుకుతుంది. కానీ అది నిలబెట్టుకోలేరు. ఈ కోవలోకే వస్తుంది షాలిని పాండే. ఈ జబల్ పూర్ చిన్నది అర్జున్ రెడ్డి మూవీతో అతిపెద్ద హిట్ నమోదు చేసింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఓ ఇన్నోసెంట్ మెడికల్ స్టూడెంట్ క్యారెక్టర్ కోసం షాలిని పాండేను ఎంపిక చేశాడు. ఆమెకు ఇది డెబ్యూ మూవీ. న్యూ ఏజ్ లవ్ డ్రామాగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి సంచలన విజయం నమోదు చేసింది. విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. షాలిని పాండే కూడా కొంతలో కొంత ఫేమ్ తెచ్చుకుంది.
అయితే స్క్రిప్ట్ సెలక్షన్ లో తడబడ్డ ఈ చిన్నది త్వరగా ఫేడ్ అవుట్ అయ్యింది. అనూహ్యంగా ఆమెకు సపోర్టింగ్ రోల్స్ దక్కాయి. మహానటి చిత్రంలో కీర్తి సురేష్ ఫ్రెండ్ గా ఆమె కనిపించారు. ఎన్టీఆర్ బయోపిక్ లో ఓ గెస్ట్ రోల్ చేశారు. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన థ్రిల్లర్ 118 మూవీలో షాలిని పాండేకు మరోసారి లీడ్ హీరోయిన్ ఆఫర్ దక్కింది. ఈ చిత్రం పర్లేదు అనిపించుకుంది. ఆఫర్స్ తెచ్చిపెట్టే మూవీ అయితే కాలేకపోయింది.
రాజ్ తరుణ్ కి జంటగా ఇద్దరి లోకం ఒకటే టైటిల్ తో ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ చేయగా ఫలితం దక్కలేదు. దీంతో మరోసారి ఆమె సపోర్టింగ్ రోల్ చేశారు. అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ నిశ్శబ్దం లో షాలిని పాండే ఓ కీలక రోల్ చేశారు. పాన్ ఇండియా మూవీగా విడుదలైన నిశ్శబ్దం బ్రేక్ ఇస్తుందని షాలిని నమ్మారు. మళ్ళీ ఆమెకు నిరాశే ఎదురైంది.
ఆమెకు అడపాదడపా బాలీవుడ్ ఆఫర్స్ రావడం విశేషం. రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన జయేష్ భాయ్ జోర్దార్ మూవీలో షాలిని పాండే హీరోయిన్ గా నటించారు. జయేష్ భాయ్ జోర్దార్ ఆమె ఖాతాలో మరో ప్లాప్ గా చేరిపోయింది. వరుస పరాజయాలతో షాలిని పాండే కెరీర్ ప్రమాదంలో పడింది. టాలీవుడ్ లో ఆమెకు అన్ని దారులు మూసుకుపోయాయి. ఆఫర్స్ దక్కే సూచనలు లేవు. ప్రస్తుతం హిందీలో ఓ మూవీ చేస్తున్నారు.
గ్లామర్ ఫీల్డ్ లో రాణించాలంటే ఏదో విధంగా వార్తల్లో నిలవాలి. అందుకు సోషల్ మీడియాను నమ్ముకుంది షాలిని పాండే. బోల్డ్ ఫోటో షూట్స్ తో కాకరేపుతుంది. తాజాగా ఆమె బికినీ పోలిన డ్రెస్ హాట్ ఫోటో షూట్ చేసింది. షాలిని పాండే తెగింపుకు నెటిజెన్స్ మైండ్ బ్లాక్ అవుతుంది. క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.