Pawan Kalyan Alliances: ఏపీలో పొత్తులపై ఫుల్ క్లారిటీ.. పవన్ తేల్చిచెప్పేశారుగా..

వైసీపీని గద్దె దించాలని పవన్ స్ట్రాంగ్ నిర్ణయానికి వచ్చారు. ఆ దిశగానే తన చర్యలను మొదలుపెట్టారు. నిన్నటి ఉభయ గోదావరి జిల్లాలో దీనిపైనే ప్రధానంగా మాట్లాడారు. వైసీపీ అడ్డగోలుగా రాజకీయ ఫ్యాక్షనిజానికి దిగిందని ఆరోపించారు.

Written By: Dharma, Updated On : May 12, 2023 10:08 am

Pawan Kalyan Alliances

Follow us on

Pawan Kalyan Alliances: ఏపీలో పొత్తులపై క్లారిటీ వస్తోంది. వైసీపీ విముక్త ఏపీకి కట్టుబడి ఉన్నానని పవన్ మరోసారి స్పష్టం చేశారు. దీంతో గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరదించారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం నుంచి పాలనను తప్పించి ప్రజలకు అప్పగిస్తానని చెప్పడం ద్వారా ఆయన బలమైన ఆకాంక్షను బయటపెట్టారు. అయితే ఇది అధికార పార్టీకి మింగుడు పడడం లేదు. కర్నాటక ఫలితాలను అనుసరించి పవన్ వ్యూహాలు ఉంటాయని భావించారు. అంతకంటే ముందుగానే అన్ని అంశాలపై క్లారిటీ ఇవ్వడంతో రాజకీయ ప్రత్యర్థుల ఆశలు నీరుగారిపోయాయి. జనసేన పొత్తుల వైపు వెళ్లకూడదని భావించిన వైసీపీ అనుకూల వర్గాల్లో ఇప్పుడు ఆందోళన ప్రారంభమైంది. ఉభయ గోదావరి జిల్లాల్లో అకాల వర్షంతో నష్టపోయిన రైతులను పవన్ గత రెండు రోజులుగా పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

వైసీపీది ఫ్యాక్షన్ రాజకీయం…
వైసీపీని గద్దె దించాలని పవన్ స్ట్రాంగ్ నిర్ణయానికి వచ్చారు. ఆ దిశగానే తన చర్యలను మొదలుపెట్టారు. నిన్నటి ఉభయ గోదావరి జిల్లాలో దీనిపైనే ప్రధానంగా మాట్లాడారు. వైసీపీ అడ్డగోలుగా రాజకీయ ఫ్యాక్షనిజానికి దిగిందని ఆరోపించారు.రాజకీయ ప్రత్యర్థులను హింసకు గురిచేస్తోందని.. చిల్లర, మల్లర రాజకీయాలు చేస్తోందని.. నిర్మాణాత్మక రాజకీయాలే తనకు ఇష్టమంటూ పవన్ పునరుద్ఘాటించారు. ఫ్యాక్షన్ రాజకీయాల విషయమే ఢిల్లీ పెద్దలకు చెప్పినట్టు స్పష్టం చేశారు. అందుకే బీజేపీ సైతం తమతో కలిసివస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సీఎం పదవిపై..
వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఖాయమని పవన్ తేల్చిచెప్పారు. ఆ బాధ్యత జనసేన తీసుకుందని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని వైసీపీ అతలాకుతలం చేసి.. అస్తవ్యస్తం చేస్తే ఎందుకు ఊరుకుంటామని ప్రశ్నించారు. కచ్చితంగా తిరగబడతామని స్పష్టం చేశారు. ‘బీఆర్‌ఎస్‌, బీజేపీ కూడా పొత్తులతో బలపడిన పార్టీలేనని గుర్తించుకోవాలన్నారు. కమ్యూనిస్టులు కూడా కలిసి వస్తే మంచిదే. కానీ కలిసి రారు’ అని వ్యాఖ్యానించారు. మీరు సీఎం రేసులో లేరా అని ప్రశ్నించగా.. ‘సీఎం రేసులోనా? మీరు చేసేయండి.. అందరూ సంసిద్ధంగా ఉంటే.. మీ ప్రయత్నం మీరు చేస్తే.. పదవి అనేది తనంతట తానే వరిస్తుంది. కష్టపడి పని చేస్తే ముఖ్యమంత్రి పదవి అనేది వరించి తీరాలి. దాని కోసమే పని చేస్తున్నాను అని బదులిచ్చారు.

ఓటింగ్ శాతం పెరిగింది..
చాలారకాలుగా అధ్యయనం చేసిన తరువాతే జనసేన ను స్థాపించినట్టు పవన్ గుర్తుచేశారు. 2014లో అన్నిరకాలుగా ఆలోచించే టీడీపీ, బీజేపీలకు సపోర్టు చేసినట్టు తెలిపారు. ఆ రోజు సీట్లు తీసుకోకపోవడానికి కారణం, మేం పార్టీ పెట్టి ఒక నెల కూడా కాలేదు. అభ్యర్థులను వెతుక్కునే పరిస్థితి లేదు. 2019లో 137 స్థానాల్లో పోటీ చేశాం. జనసేనకు 7 శాతం ఓటింగ్‌ వచ్చింది. ప్రతికూల పరిస్థితుల్లో ఇంత వచ్చిందంటే సామాన్యమైన విషయం కాదు. బలం ఉన్న చోట 18, 20, 30 శాతం వరకూ ఓటింగ్‌ ఉంది. మా ఓటుబ్యాంకు ఇప్పుడు గత ఎన్నికల కంటే రెట్టింపయింది. మిగిలిన పార్టీలు దానిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. రాయలసీమలో అంత ఓటు బ్యాంకు లేకపోయినా.. పట్టున్న ప్రాంతాల్లో మాత్రం బలమైన ఓటింగ్‌ ఉంది. ఈ సారి జనసేనతో అందరూ కలిసి వస్తే సంతోషం. మాగౌరవం ఉండేలా, అన్నీఉంటే కచ్చితంగా పొత్తులతోనే ముందుకు వెళ్తామని పవన్ స్పష్టం చేశారు.