https://oktelugu.com/

Shakalaka Shankar: జనసేన వలన దివాళా తీశా, నా భార్య దూరం పెట్టింది… షకలక శంకర్ సంచలనం!

తాజా ఇంటర్వ్యూలో శంకర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అభిమానంతో లక్షలు ఖర్చు పెట్టి ప్రచారం చేస్తే కనీసం పవన్ కళ్యాణ్ ఫోన్ కూడా చేయలేదని ఆవేదన చెందాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : May 24, 2024 / 05:42 PM IST

    Shakalaka Shankar Sensational comments on Janasena Party

    Follow us on

    Shakalaka Shankar: జబర్దస్త్ వేదికగా పాపులర్ అయిన షకలక శంకర్ సినిమాల్లో కమెడియన్ గా రాణిస్తున్నాడు. కాగా షకలక శంకర్, పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. 2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన గెలుపు కోసం సినీ సెలబ్రెటీలు, జబర్దస్త్ కమెడియన్స్ పిఠాపురంలో ప్రచారం చేశారు. షకలక శంకర్ సైతం పవన్ కళ్యాణ్ పై అభిమానంతో పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించాడు.

    తాజా ఇంటర్వ్యూలో శంకర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అభిమానంతో లక్షలు ఖర్చు పెట్టి ప్రచారం చేస్తే కనీసం పవన్ కళ్యాణ్ ఫోన్ కూడా చేయలేదని ఆవేదన చెందాడు. తన భార్య కూడా తనతో నాలుగు రోజులు మాట్లాడలేదని అన్నారు. శంకర్ మాట్లాడుతూ .. 2019 ఎన్నికల్లో జనసేన కోసం నా సొంత డబ్బులు ఖర్చు పెట్టా. మూడు లక్షలతో భోజనాలు పెట్టించాను.

    నేను ఎక్కడికి వెళ్లినా కుర్రోళ్ళు దీనంగా చూస్తుంటారు అన్న వచ్చాడని. అందుకే వాళ్ళని చూసి ఊరుకోలేను. చేతిలో ఉన్న డబ్బంతా అయిపోయింది. నా ఫ్రెండ్ దగ్గర ఒక వెయ్యి రూపాయలు తీసుకొని డీజిల్ కొట్టించుకుని ఇంటికి వచ్చాను. నా ఫ్యామిలీకి అడ్వాన్సులు వచ్చాయి. డబ్బుతో ఇంటికి వస్తున్న అని చెప్పా. కానీ నా డబ్బులన్నీ జనసేన కోసం వాడేశాను. దాంతో నాలుగు రోజులు మా ఆవిడా నాతో మాట్లాడలేదు.

    మా మావయ్య కూడా పవన్ కళ్యాణ్ .. పవన్ కళ్యాణ్ అని డబ్బంతా ఖర్చు చేశావు. కనీసం మీ పవన్ కళ్యాణ్ నీకు ఫోన్ చేశాడా అని అడిగారు. నేను వాళ్ళ నుంచి ఏమి ఆశించలేదు. కానీ మా మావయ్య ఇలా అడిగేసరికి నిజమే కదా అనుకున్నాను. నేను ఇంత చేస్తే ఆయనకు తెలియదా అనిపించింది. 2024 ఎన్నికల్లో కూడా సేమ్ .. ఈసారి వారం రోజులు తిరిగాను. ఈసారి కూడా డబ్బులేమీ ఇవ్వలేదు. ఫుడ్డు, వసతి, డీజిల్ ఖర్చులు వాళ్ళే చూసుకున్నారు. నాకేం ఇవ్వలేదు. కేవలం అభిమానంతో చేశా అని శంకర్ చెప్పుకొచ్చాడు.