Dombivali Factory Blast: ఆ కెమికల్ ఫ్యాక్టరీలో దారుణం.. విజువల్స్ వైరల్..

కంపెనీ యజమాని మలయ్ ప్రదీప్ మెహతా, మాల్తీ ప్రదీప్ మెహతా, ఇతర డైరెక్టర్లు, అముదాన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ అధికారులపై మన్పడా పోలీస్ స్టేషన్ అధికారులు కేసు నమోదు చేశారు.

Written By: Neelambaram, Updated On : May 24, 2024 6:14 pm

Dombivali Factory Blast

Follow us on

Dombivali Factory Blast: మహారాష్ట్రలోని థానే జిల్లా డోంబివ్లీ ఈస్ట్ లోని ఓ కెమికల్ కంపెనీలో జరిగిన బాయిలర్ పేలుడులో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరిందని, పలువురు కార్మికులు, స్థానికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు చెప్తున్నారు. ప్లాంట్ డైరెక్టర్లు, ఇతర సీనియర్ అధికారులపై హత్యానేరం, పేలుడు పదార్థాల చట్టం తదితర అభియోగాల కింద కేసులు నమోదు చేశారు.

కంపెనీ యజమాని మలయ్ ప్రదీప్ మెహతా, మాల్తీ ప్రదీప్ మెహతా, ఇతర డైరెక్టర్లు, అముదాన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ అధికారులపై మన్పడా పోలీస్ స్టేషన్ అధికారులు కేసు నమోదు చేశారు.

ప్రమాదకరమైన రసాయనాలను హ్యాండిల్ చేసేటప్పుడు, ప్రాసెస్ చేసేటప్పుడు, నిల్వ చేసేటప్పుడు భద్రతా జాగ్రత్తలు పాటించడానికి బాధ్యత వహించిన యజమానులు, మేనేజర్ మరియు బాధ్యులందరిపై కేసు నమోదు చేసినట్లు థానే పోలీసు కమిషనర్ అశుతోష్ డుంబ్రే వెల్లడించారు.

ఈ ఘటనకు సంబంధించి సీసీ కెమెరాలలో రికార్డయిన వీడియో క్లిప్ లు వైరల్ గా మారాయి. దీంతో పాటు ప్రమాదం జరిగిన ప్రదేశంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సహాయ చర్యలు ఆ రాష్ట్ర ముఖ్యమైంత్రి ఫడ్నవీస్ పరిశీలించారు. దీంతో పాటు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.