Pawan Kalyan: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగాలంటే టాలెంట్ తో పాటు కొన్ని విషయాల్లో క్రమశిక్షణను పాటిస్తుండాలి. స్టార్ డమ్ వచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తే మాత్రం ఇండస్ట్రీలో ఎక్కువ రోజుల పాటు వాళ్ళ మనుగడ కొనసాగదని చాలామంది సినిమా మేధావులు సైతం హెచ్చరిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పాపులారిటిని సంపాదించుకున్న నటుడు షకలక శంకర్…ఆ షో ద్వారా వచ్చిన పాపులారిటీ తో సినిమాల్లో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా తన సత్తా చాటుకున్నాడు. అయితే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ జరుగుతున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ తో కాంబినేషన్ చేస్తున్నప్పుడు శంకర్ లేటుగా వచ్చాడట. దాంతో పవన్ కళ్యాణ్ శంకర్ ను పిలిచి లేటెందుకు అయ్యింది అని అడిగినప్పటికి అతను కేర్లెస్ గా సమాధానం చెప్పడంతో పవన్ కళ్యాణ్ కి విపరీతంగా కోపం వచ్చి అతన్ని కొట్టారట. దాంతో అప్పటినుంచి షకలక శంకర్ కి అవకాశాలైతే తగ్గిపోయాయి అంటు కొన్ని వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి…
Also Read: మరోసారి కెప్టెన్ గా ఇమ్మానుయేల్..తెలుగు బిగ్ బాస్ హిస్టరీలోనే ఆల్ టైం రికార్డు!
ఒక్కసారి ఇండస్ట్రీలో ఒక వ్యక్తి మీద ఏదైనా బ్యాడ్ గా క్రియేటయితే మాత్రం దానిని తప్పించడం చాలా కష్టతరమనే చెప్పాలి. నిజానికి సర్దార్ గబ్బర్ సింగ్ సెట్ లో ఏం జరిగిందంటే పవన్ కళ్యాణ్ శకలక శంకర్ తో ఏదైనా అవసరం ఉండి లేటుగా వచ్చావా? ఏదైనా ఇబ్బంది అయిందా? అని అడిగినప్పటికి శంకర్ అంతకు ముందు కో డైరెక్టర్ తో ఎలాగైతే సమాధానం చెప్పాడో పవన్ కళ్యాణ్ తో కూడా అలాగే పట్టించుకోనట్టుగా జవాబిచ్చాడట.
దాంతో లేట్ గా వచ్చిందే కాకుండా తను అలా బలుపు చూపించడంతో పవన్ కళ్యాణ్ శంకర్ తో ఇండస్ట్రీ లో జాగ్రత్తగా ఉండాలి. సక్సెస్ గర్వాన్ని తలెక్కెక్కించుకోకూడదు. నీకోసం ఇంతమంది వెయిట్ చేసినప్పుడు నువ్వు అలా రావడం కరెక్ట్ కాదని చెప్పి ఇది మళ్ళీ రిపీట్ కానివ్వకు అని తనను మందలించాడట…
కానీ పవన్ కళ్యాణ్ శంకర్ ను కొట్టాడు అంటూ కొందరు దీనిని కావాలనే అలా క్రియేట్ చేశారు అంటూ శంకర్ సైతం గతంలో ఒక క్లారిటీ ఇచ్చాడు…ఇక ఈ సెట్ లో జరిగిన విషయం ఇండస్ట్రీ అంత తెలిసి శంకర్ పవన్ కళ్యాణ్ చేతనే తిట్లు తిన్నాడంటే అతను మనకు సెట్ అవ్వడు అంటూ చాలా మంది దర్శక నిర్మాతలు శంకర్ ను పక్కన పెట్టారు…
తర్వాత కమెడియన్ గా ఆయనకి అవకాశాలు తగ్గిపోయాయి… హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. ఆ మూవీ ప్రమోషన్స్ లలో కూడా దిల్ రాజు త్రివిక్రమ్ లాంటి వాళ్లను ఉద్దేశించి కొన్ని ఘాటు కామెంట్స్ చేయడంతో ఆయన మీద విమర్శలైతే వెల్లువెత్తాయి…ఇక ఆ ఆయన చేసిన సినిమాలు సైతం అనుకున్న రేంజ్ లో సక్సెస్ ని సాధించకపోవడంతో ఆయన చాలా వరకు వెనకబడిపోయారు. ఆయనకి అవకాశాలు ఇచ్చేవారు కరువయ్యారు.. దాంతో ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీగా ఉంటున్నాడు…