https://oktelugu.com/

Shah Rukh Khan: మొన్న ప్రభాస్..నేడు రామ్ చరణ్..టాలీవుడ్ హీరోలపై పగబట్టిన షారుఖ్ ఖాన్

డిసెంబర్ 20 వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా పాన్ ఇండియన్ లెవెల్ లో అన్నీ భాషల్లో విడుదల చెయ్యనున్నారు. ఈ సినిమా #RRR తర్వాత వస్తుంది కాబట్టి ఈ చిత్రంపై ట్రేడ్ లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

Written By:
  • Vicky
  • , Updated On : August 13, 2024 / 01:37 PM IST

    Shah Rukh Khan

    Follow us on

    Shah Rukh Khan: ఈ ఏడాది డిసెంబర్ నెల ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపించబోతుంది. ఇప్పటికే ఈ నెలలో పుష్ప సీక్వెల్ ‘పుష్ప ది రూల్’ విడుదలకు సిద్ధం అవుతుంది. డిసెంబర్ 6 వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అనే రూమర్ కూడా వినిపిస్తుంది కానీ, మేకర్స్ మాత్రం చెప్పిన సమయానికే వచ్చేట్టు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమాకి తెలుగుతో పాటుగా హిందీ లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టే సత్తా ఉన్న సినిమా. ఇదే నెలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘గేమ్ చేంజర్’ చిత్రం కూడా విడుదల కానుంది.

    డిసెంబర్ 20 వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా పాన్ ఇండియన్ లెవెల్ లో అన్నీ భాషల్లో విడుదల చెయ్యనున్నారు. ఈ సినిమా #RRR తర్వాత వస్తుంది కాబట్టి ఈ చిత్రంపై ట్రేడ్ లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అలాగే ఈ సినిమా నుండి విడుదలైన మొదటి పాట ‘జరగండి జరగండి’ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ పాటనే వినిపిస్తుంది. వీటితో పాటు వరుణ్ ధావన్ – అట్లీ కాంబినేషన్ లో వస్తున్న ‘బేబీ జాన్’, మంచు విష్ణు ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’ , విష్ణు కౌశల్ ‘చావా’, అమీర్ ఖాన్ నటించిన ‘సితారే జమీన్ పర్’ చిత్రాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే షారుఖ్ ఖాన్ కూడా ఈ బాక్స్ ఆఫీస్ వార్ లో భాగం కానున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే లయన్ కింగ్ కి సీక్వెల్ గా తెరకెక్కిన ‘ముఫాసా : ది లయన్ కింగ్’ అనే చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాని డిసెంబర్ 20 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో లయన్ కింగ్ కి షారుఖ్ ఖాన్ డబ్బింగ్ చెప్పనున్నాడు. అలాగే ముఫాసా మరియు సింబా పాత్రలకు షారుఖ్ ఖాన్ కొడుకులు ఆర్యన్ ఖాన్, అభిరాం ఖాన్ డబ్బింగ్ చెప్పనున్నారు. ఈ చిత్రం ‘గేమ్ చేంజర్’ విడుదలైన రోజునే విడుదల కాబోతుంది.

    షారుఖ్ ఖాన్ కి రామ్ చరణ్ మంచి స్నేహితుడు. అనేక సందర్భాలలో షారుఖ్ ఖాన్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. తన సొంత సినిమానే అయ్యుంటే షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ కోసం వెనక్కి తగ్గేవాడేమో, కానీ హాలీవుడ్ చిత్రం కాబట్టి, కామన్ గా వాళ్ళు ఒకే డేట్ ఫిక్స్ అవుతారు కాబట్టి గేమ్ చేంజర్ తో పోటీ పడడం అనివార్యం అయిపోయింది. గతం లో షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన ‘డుంకీ’ చిత్రం, ప్రభాస్ సలార్ తో పోటీ పడింది. ఇప్పుడు మరో తెలుగు హీరో రామ్ చరణ్ తో ఆయన పోటీ పడుతున్నాడు. చూస్తుంటే షారుఖ్ ఖాన్ కి తెలుగు హీరోల మీద పగ ఉన్నట్టుండి అంటూ సోషల్ మీడియా లో ఫన్నీ ట్రోల్ల్స్ నడుస్తున్నాయి.