AP Liquer polacy  : రూ.110 కొట్టు.. బ్రాండెడ్ క్వార్టర్ పట్టు.. ఏపీలో తాగినోడికి తాగినంత!

మద్యం ఆరోగ్యానికి హానికరమైనా.. చాలామందికి వ్యసనంలా మారిపోయింది. ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఉంది. ఐదేళ్లుగా నాసిరకం మద్యంతో ఆదాయం సమకూర్చుకుంది వైసిపి ప్రభుత్వం.కానీ ఇప్పుడు బ్రాండెడ్ మద్యాన్ని తక్కువ ధరకు అందించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.

Written By: Dharma, Updated On : August 13, 2024 1:44 pm

AP Liquer polacy

Follow us on

AP Liquer polacy : ఏపీలో మందుబాబులకు శుభవార్త. మరో 45 రోజుల్లో నాణ్యమైన మద్యం అందుబాటులోకి రానుంది. 2014 నుంచి 2019 మధ్య ఉన్న మద్యం పాలసీ అమలు కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీలో భాగంగా..నాణ్యమైన మద్యంతో పాటు తక్కువ ధరకు అందించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో క్వార్టర్ మద్యం రూ. 110, బీరు కూడా అదే ధరలో అందేది.ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అదే నాణ్యమైన మద్యంతో పాటు ధరలను కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. నూతన మద్యం పాలసీ అమలు చేస్తున్న నేపథ్యంలో మంత్రుల బృందం వివిధ రాష్ట్రాలను సందర్శిస్తోంది. అక్కడ పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది.ఈ క్రమంలోనే క్వార్టర్ మద్యం ధరను 110 రూపాయలకు అందించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.బ్రాండెడ్ మద్యంను తక్కువ ధరకు అందిస్తే.. అమ్మకాలు పెరుగుతాయని..తద్వారా ఆదాయం తగ్గకుండా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసినట్లు తెలుస్తోంది. దేశంలో పేరు మోసిన బ్రాండ్లన్నీ అందుబాటులోకి వస్తే..మందు బాబుల్లో ఒక రకమైన సానుకూలత కనిపిస్తుందని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. తాము గెలిస్తే నాణ్యమైన మద్యంతో పాటు తక్కువ ధరకు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.అందుకే ఇప్పుడు అమలు చేయాలని భావిస్తున్నారు.అక్టోబర్ 1 నుంచి అన్ని రకాల మద్యం బ్రాండ్లు దుకాణాల్లో అందుబాటులోకి రానున్నాయి.

* మద్యం పాలసీ ఫెయిల్
గత ఐదేళ్ల వైసిపి పాలనలో మద్యం విధానం ఫెయిల్ అయింది. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. మద్య నిషేధం అంటూ ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలను నడపడాన్ని ప్రజలు స్వాగతించలేదు. పోనీ నాణ్యమైన మద్యం అందించారంటే అది లేదు. ప్రజల ప్రాణాలతో ఆటలాడుకున్నారు. నాసిరకం మద్యంతో వేలాదిమంది చనిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయినా సరే మద్యం విషయంలో వైసీపీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు.

* ధర తగ్గుముఖం
కొత్త మద్యం పాలసీ అమల్లోకి వస్తే మద్యం ధరలు భారీగా తగ్గనున్నాయని తెలుస్తోంది.ఇప్పటికే దీనిపై మంత్రులు ప్రకటనలు కూడా చేశారు.తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందేలా చర్యలు చేపడతామని.. క్వార్టర్ బాటిల్ 110 రూపాయలు లోపే ఉంచేలా చేస్తామని చాలామంది మంత్రులు ప్రకటనలు చేశారు. ఆయా కంపెనీల ప్రతినిధులతో చర్చలు కూడా జరుపుతున్నట్లు చెప్పుకొచ్చారు.

* పక్క రాష్ట్రాల నుంచి క్యూ
ఏపీలో ఉన్న మద్యం ధరలతో మందుబాబులు పక్క రాష్ట్రాల వైపు చూసేవారు.మన రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ,కర్ణాటక,తమిళనాడు,ఒడిస్సా సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్నాయి. ఏపీలో నాసిరకం మద్యం నేపథ్యంలో మందుబాబులు ఇతర రాష్ట్రాలను ఆశ్రయించేవారు. దీంతో అక్కడ మద్యం ధరలకు రెక్కలు వచ్చాయి. ఇప్పుడు కొత్త మద్యం పాలసీలో భాగంగా బ్రాండెడ్ మద్యాన్ని తక్కువ ధరకే ఏపీ ప్రభుత్వం అందిస్తే.. మిగతా రాష్ట్రాల నుంచి మందుబాబులు ఏపీ వైపు చూసే అవకాశం ఉంది.