https://oktelugu.com/

Kamal Haasan: కమల్ హాసన్ భారతీయుడు 3 మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదా..? ఇలా అయితే ఎలా మరి…

ఒక సినిమా సూపర్ సక్సెస్ అయింది అంటే ఆ సినిమా వెనక దర్శకుడు, హీరో చేసిన కృషి దాగి ఉంటుంది. ఇక ఆ క్రెడిట్ కూడా వాళ్లకే దక్కుతుంది. ఇక తమిళ్ సినిమా డైరెక్టర్ అయిన శంకర్ కూడా మొదటి నుంచి భారీ సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : August 13, 2024 / 01:34 PM IST

    Kamal Haasan

    Follow us on

    Kamal Haasan: తమిళ్, తెలుగు సినిమా ఇండస్ట్రీల్లో ఒక గుర్తింపు పొందిన నటుడు కమల్ హాసన్… సాగర సంగమం, శుభసంకల్పం, స్వాతిముత్యం లాంటి ఎన్నో సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కమలహాసన్ ‘భారతీయుడు ‘ సినిమాతో ఒక్కసారిగా తనలోని కొత్త యాంగిల్ ని బయటపెట్టాడు. ఇక అప్పటివరకు ఆర్ట్ సినిమాలను మాత్రమే చేసిన కమల్ హాసన్ ఒక్కసారిగా కమర్షియల్ సినిమాలను చేయడమే కాకుండా అందులో డిఫరెంట్ పాత్రలను పోషించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఈ సినిమా తమిళంలో ఇండస్ట్రీ హిట్ కొట్టడమే కాకుండా కమలహాసన్ కి నేషనల్ అవార్డు ను కూడా తెచ్చి పెట్టింది. మొదట్లో శంకర్ లాంటి దర్శకుడితో సినిమా ఎందుకు చేస్తున్నావ్ అని అన్నవాళ్లే ఈ సినిమా చూసిన తర్వాత శంకర్ లాంటి దర్శకుడు ఇండస్ట్రీకి కావాలి అని పొగడడం నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. నిజానికి ఆ సినిమాని కమలహాసన్ చాలా సాహసం చేసి చేశారనే చెప్పాలి. ఎందుకంటే కొత్త దర్శకుడు అందులోను హెవీ సబ్జెక్ట్ ని ఎలా డీల్ చేస్తారో తెలియదు. అయినప్పటికీ కమలహాసన్ మాత్రం శంకర్ మీద నమ్మకం ఉంచి ఈ సినిమాను చేసి సక్సెస్ ఫుల్ గా నిలపడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం…ఇక ఇదిలా ఉంటే వీళ్ళ కాంబినేషన్ లో రీసెంట్ గా వచ్చిన ‘భారతీయుడు 2’ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

    కారణం ఏంటి అంటే కథలో జాగ్రత్తలు తీసుకోకపోవడమే అని తెలుస్తుంది. ఇక దానికి తోడుగా ‘భారతీయుడు 3’ సినిమాని కూడా రూపొందిస్తున్నారు. ఇక ఇప్పటికే 30% షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా భారతీయుడు సినిమాకి ఫ్రీక్వెల్ గా తెరకెక్కుతుంది. కమల్ హాసన్, శంకర్ భారతీయుడు సినిమాతో ఎలాంటి క్రేజ్ ను అయితే సంపాదించుకున్నారో ఇప్పుడు ఆ క్రేజ్ మొత్తం పోగొట్టుకున్నారనే చెప్పాలి.

    అందుకే శంకర్ ‘భారతీయుడు 3’ ని చాలా ప్రెస్టేజ్ గా తీసుకొని ఎలాగైనా సరే ఒక బ్లాక్ బాస్టర్ గా మలచాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా కథని రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమా మీద పూర్తి ఫోకస్ పెట్టాలని చూస్తున్నాడు. అయితే దీనికి మాత్రం కమల్ హాసన్ పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది.

    భారతీయుడు 2 సినిమా ఫ్లాప్ తర్వాత కమలహాసన్ భారీగా నిరుత్సాహపడ్డట్టుగా వార్తలైతే వస్తున్నాయి. అందుకే భారతీయుడు 3 సినిమా మీద ఆయన పెద్దగా ఆసక్తి అయితే చూపించడం లేదని తెలుస్తుంది. మరి శంకర్ ఎలాగైనా సరే కమల్ హాసన్ ను ఒప్పించి భారతీయుడు 3 షూట్ మొత్తాన్ని కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు. మరి కమలహాసన్ కన్విన్స్ అయి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తాడా లేదంటే సినిమా నుంచి పూర్తిగా తప్పుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది…