https://oktelugu.com/

బాలీవుడ్ స్టార్ హీరోతో ‘రాశీ ఖన్నా’ దాగుడు మూతలు !

బాలీవుడ్ లో ‘మద్రాస్ కేఫ్’ అనే చిత్రంతో ఆరంగేట్రం చేసిన రాశీ ఖన్నా ఆ తర్వాత అవసరాల శ్రీనివాస్ ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి తన చబ్బీ చబ్బీ లుక్స్ తో కుర్రకారు మతులు పోగొట్టింది. వరుసగా మంచి కథలను సెలెక్ట్ చేసుకుని సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం తెలుగులో ఆమెకు అంతగా అవకాశాలు లేనట్లుగా తెలుస్తుంది. Also Read: అక్కినేని హీరో ఆశలన్నీ ఆ సినిమా పైనే ! […]

Written By: , Updated On : January 26, 2021 / 11:34 AM IST
Follow us on

Shahid Kapoor, Raashi Khanna
బాలీవుడ్ లో ‘మద్రాస్ కేఫ్’ అనే చిత్రంతో ఆరంగేట్రం చేసిన రాశీ ఖన్నా ఆ తర్వాత అవసరాల శ్రీనివాస్ ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి తన చబ్బీ చబ్బీ లుక్స్ తో కుర్రకారు మతులు పోగొట్టింది. వరుసగా మంచి కథలను సెలెక్ట్ చేసుకుని సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం తెలుగులో ఆమెకు అంతగా అవకాశాలు లేనట్లుగా తెలుస్తుంది.

Also Read: అక్కినేని హీరో ఆశలన్నీ ఆ సినిమా పైనే !

అయితే డీలా పడిపోయి కెరీర్ ని పాడు చేసుకోకుండా ఇతర భాషల నుండి వస్తున్న ఆఫర్స్ తో తిరిగి ఫామ్ లోకి రావటానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడంతా వెబ్ సిరీస్ హవా నడవటంతో బడా స్టార్స్ కూడా వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే వెబ్ సిరీస్ అవకాశాలని సైతం ఒప్పుకుంటుందట. బాలీవుడ్ లో ఒక ప్రతిష్టాత్మకమైన వెబ్ సిరీస్ కోసం రాశిని సంప్రదించగా ఆమె కూడా అంగీకారం తెలిపింది.

Also Read: సింగర్ సునీత-రామ్ ల వెడ్డింగ్ టీజర్… వైరల్

‘ది ఫ్యామిలీ మ్యాన్’ లాంటి హిట్ వెబ్ సిరీస్ తీసిన రాజ్ అండ్ డికె దర్శకత్వంలో వస్తున్న కొత్త వెబ్ సిరీస్ లో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ సరసన రాశి ఖన్నా లీడ్ రోల్ లో నటిస్తుంది. తాజాగా మొదలైన ఈ వెబ్ సిరీస్ షూటింగ్ స్పాట్ నుండి ఒక పిక్ షేర్ చేసి అభిమానులని ఆశ్చర్యపరిచింది. షాహిద్ కపూర్ ని తన వెనుక దాచేస్తూ ఎద ఆందాలని ఆరబోస్తున్న రాశీ ఖన్నా చాలా హాట్ గా కనిపిస్తుంది. అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్