Samantha Rutuprabhu : ప్రతీ ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఫెడరేషన్ అకాడమీ(IIFA)’ అవార్డ్స్ ని ఈ ఏడాది కూడా గ్రాండ్ గా అబుదాబి లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న టాప్ మోస్ట్ సూపర్ స్టార్స్ అందరూ విచ్చేసారు. సాధారణంగా ఇలాంటి ఈవెంట్స్ కి బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఈ ఏడాది కూడా ఆయనే వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఆయనతో పాటు బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. హోస్టింగ్ చేయడం లో షారుఖ్ ఖాన్ స్టైల్ వేరు. చాలా ఎంటర్టైన్మెంట్ తో, సరదాగా వచ్చిన అతిథులకు బోర్ కొట్టకుండా తన ఎనర్జీ ని అలా పంపించేస్తాడు. ఈ ఈవెంట్ లో కూడా ఆయన అదే తరహా ఎనర్జీ తో విక్కీ కౌశల్ తో కలిసి ఎంటర్టైన్మెంట్ ని అందించాడు.
పుష్ప చిత్రం బాలీవుడ్ లో ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో మన అందరికీ తెలిసిందే. ఈ ఈవెంట్ లో షారుఖ్ ఖాన్ పుష్ప ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు. విక్కీ కౌశల్ తో కలిసి ‘తగ్గేదేలే’ మ్యానరిజం చేయడం తో పాటు, ఆ సినిమాలో బ్లాక్ బస్టర్ గా నిల్చిన ‘ఊ అంటావా మావ..ఉఊ అంటావా మావ’ పాటకు ఫన్నీ గా డ్యాన్స్ వేసే ప్రయత్నం చేసాడు. అందులో భాగంగా షారుఖ్ ఖాన్ సమంత ని ఇమిటేట్ చేస్తూ తెగ వెక్కిరించినట్టుగా అనిపించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. సమంత కూడా ఈ ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిల్చింది. ఆమెకు కూడా IIFA అవార్డు దక్కింది. అయితే ఏ సినిమాకి సంబంధించి ఆమెకు ఆ అవార్డు వచ్చింది అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే సమంత ని షారుఖ్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ ఇమిటేట్ చేసే రేంజ్ కి వెళ్లిందంటే ఆమె స్థాయి ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
మయోసిటిస్ వ్యాధి కారణంగా గత కొంతకాలంగా శస్త్ర చికిత్స చేయిచుకుంటున్న సమంత, డాక్టర్ల సలహా మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటుంది. విశ్రాంతి సమయం ముగియడం తో మళ్ళీ ఆమె సినిమా షూటింగ్స్ లో బిజీ అయ్యింది. రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ కి దూరంగా, కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే ఆమె చేస్తుంది. అందులో భాగంగా ఆమె ‘ది ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సిరీస్ లో విలన్ గా కూడా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ తోనే ఆమెకు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు కూడా లభించింది. ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించిన రాజ్ & డీకే తో మరోసారి ఆమె ‘సిటాడెల్’ అనే యాక్షన్ వెబ్ సిరీస్ చేసింది. అతి త్వరలోనే ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో టెలికాస్ట్ కానుంది.