https://oktelugu.com/

Devara Hindhi Box Office Collections : 3వ రోజు హిందీలో ఊహించని వసూళ్లు..బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని దంచికొడుతున్న’దేవర’!

మన టాలీవుడ్ సినిమాలకు బాలీవుడ్ లో మార్కెట్ తెరుచుకుంది కదా అని ప్రతీ సినిమాని హిందీలోకి డబ్ చేస్తే డబ్బింగ్ ఖర్చులు వృధా తప్ప మరొకటి ఉండదు. కంటెంట్ లో క్వాలిటీ ఉండాలి, భారీ తనం ఉట్టిపడాలి, టీజర్స్, ట్రైలర్స్ లో యాక్షన్ సన్నివేశాలు ఉండాలి, అప్పుడే వాళ్ళు ఆదరిస్తారు అనడానికి 'దేవర' చిత్రం మరోసారి రుజువు చేసింది.

Written By:
  • Vicky
  • , Updated On : September 29, 2024 7:36 pm
    Devara Movie hindhi Box office  Collection

    Devara Movie hindhi Box office  Collection

    Follow us on

    Devara Hindhi Box Office Collections :  ప్రభాస్ కి తప్ప బాలీవుడ్ లో మరో తెలుగు హీరోకి భారీ వసూళ్లు రావడం కష్టం అని నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీ లో ఒక టాక్ నడిచేది. ప్రభాస్ కి ఉన్నటువంటి ఆ ఎడ్జ్ కారణంగా ప్రస్తుత జనరేషన్ కి ఆయన మాత్రమే నెంబర్ 1 హీరో అని అనుకునేవారు. కానీ రీసెంట్ గా ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ మూవీ వసూళ్లు చూసిన తర్వాత, మన టాలీవుడ్ లో ఏ స్టార్ హీరో పాన్ ఇండియన్ సినిమా తీసినా అక్కడి ఆడియన్స్ బాగా ఆదరిస్తారు అనేది అర్థం అయ్యింది. సినిమాలో కంటెంట్ ఉంటే ప్రొమోషన్స్ అక్కర్లేదు, అద్భుతమైన వసూళ్లు వస్తాయి అని పుష్ప, కార్తికేయ 2 వంటి చిత్రాలు నిరూపించాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాల ఫలితాలను చూసి ప్రతీ హీరో పాన్ ఇండియన్ సినిమాలు చేయడం మొదలు పెట్టారు.

    మన టాలీవుడ్ సినిమాలకు బాలీవుడ్ లో మార్కెట్ తెరుచుకుంది కదా అని ప్రతీ సినిమాని హిందీలోకి డబ్ చేస్తే డబ్బింగ్ ఖర్చులు వృధా తప్ప మరొకటి ఉండదు. కంటెంట్ లో క్వాలిటీ ఉండాలి, భారీ తనం ఉట్టిపడాలి, టీజర్స్, ట్రైలర్స్ లో యాక్షన్ సన్నివేశాలు ఉండాలి, అప్పుడే వాళ్ళు ఆదరిస్తారు అనడానికి ‘దేవర’ చిత్రం మరోసారి రుజువు చేసింది. ఈ చిత్రానికి బాలీవుడ్ లో విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరగలేదు. కనీసం మొదటి రోజు ‘రాధే శ్యామ్’, ‘లైగర్’ , ‘జంజీర్’ రేంజ్ వసూళ్లు అయినా రాబడుతుందా అని అందరూ అనుకున్నారు. కానీ విడుదల తర్వాత అక్కడి విశ్లేషకులకు ఈ చిత్రం బాగా నచ్చింది. ఒక్కొక్కరు 3.5 రేటింగ్స్ కి తక్కువ కాకుండా ఇచ్చారు. ఫలితంగా మొదటి రోజు సాయంత్రం నుండి ఈ సినిమాకి బాలీవుడ్ లో టికెట్స్ తెగడం మొదలయ్యాయి. అలా మొదటి రోజు 7 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, రెండవ రోజు ఏకంగా 10 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు మూడవ రోజు 15 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు బాలీవుడ్ ట్రేడ్ పండితులు.

    కేవలం ఒక్క ముంబై ప్రాంతం లోనే నేడు సాయంత్రం షోస్ 60 కి పైగా హౌస్ ఫుల్స్ అయ్యాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమా టాక్ అక్కడ ఎలా ఉంది అనేది. అలా మొదటి వీకెండ్ 32 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఫుల్ రన్ లో 100 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. సైలెంట్ గా వచ్చి హిందీ లో ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన ‘దేవర’ ని చూసి రాబోయే పెద్ద హీరోల సినిమాల మీద కూడా ఆశలు పెరిగాయి. పుష్ప 2 చిత్రానికి బంపర్ ఓపెనింగ్ గ్యారంటీ, అందులో ఎలాంటి సందేహం లేదు, ‘గేమ్ చేంజర్’ చిత్రానికి కూడా ఇదే తరహా వసూళ్లు వస్తాయా లేదా అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం.