Shah Rukh Khan: ఇండియా లోని బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరు షారుఖ్ ఖాన్. ఆయన మన సౌత్ సినిమాల్లో పెద్దగా నటించకపోయినప్పటికీ షారుఖ్ ఖాన్ అంటే తెలియని వాళ్లంటూ ఎవ్వరూ ఉండరు. ఒకప్పుడు బాలీవుడ్ కి బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఎలా అయితే ఫేస్ గా ఉండేవాడో, ఆయన తర్వాత షారుఖ్ ఖాన్ అంతటి స్థాయికి చేరుకున్నాడు. ఇంటర్నెట్,సోషల్ మీడియా లేని రోజుల్లోనే ఆయన ఇండియా వ్యాప్తంగా పాపులర్. అలాంటి నటుడు ఇప్పుడు స్టార్ స్టేటస్ లో మాత్రమే కాదు, ఆస్తి పరంగా కూడా ఇండియా లోనే నెంబర్ 1 స్టార్ గా అవతరించాడు. తన మూడు దశాబ్దాల సినీ కెరీర్ లో, సినిమాల ద్వారా, కమర్షియల్ యాడ్స్ ద్వారా, ఈవెంట్స్ ద్వారా ఆయన సంపాదించిన ఆస్తులు 12,490 కోట్ల రూపాయలని ‘హురున్ రీసెర్చ్’ సంస్థ ప్రకటించింది.
ప్రతీ ఏడాది హురున్ రీసర్చ్ సంస్థ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు సంబంధించిన ఆస్తుల ఆధారంగా ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటుంది. నేడు 2025 వ సంవత్సరం కి గాను విడుదల చేసిన జాబితా లో షారుఖ్ ఖాన్ మొదటి స్థానం లో ఉన్నాడు. ఇక ఆయన తవాటి స్థానంలో ప్రముఖ హీరోయిన్ జుహీ చావ్లా నిల్చింది. ఆమె ఆస్తులు 7,790 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా. ఇక మూడవ స్థానం లో హృతిక్ రోషన్ నిలిచాడు. ఈయన ఆస్తులు 2,160 కోట్ల రూపాయిల వరకు ఉంటుందట. ఇక తర్వాత బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ 4, 5 స్థానాల్లో నిలిచారు. షారుఖ్ ఖాన్ కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాదు, రెడ్ చిల్లీస్ అనే సంస్థ ని ఏర్పాటు చేసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించాడు. జవాన్ చిత్రం కూడా ఈ సంస్థ నుండి వచ్చిన సినిమానే. వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం.
అదే విధంగా షారుఖ్ కి కోల్ కత్తా నైట్ రైడర్స్ అనే పాపులర్ IPL ఫ్రాంచైజ్ కూడా ఉంది. ఈ IPL టీం కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రెండు సార్లు కప్పు కూడా గెల్చుకుంది. వీటితో పాటు షారుఖ్ ఖాన్ కి ఎన్నో ఇతరత్రా వ్యాపారాలు కూడా ఉన్నాయి. అందుకే ఆయన నేడు ఈ స్థాయిలో ఉన్నాడని విశ్లేషకులు అంటున్నారు. రాబోయే రోజుల్లో ఆయన ఇంకా ఏ రేంజ్ కి వేళ్తాడో చూడాలి.