Jawan Twitter Talk: ఖాన్ త్రయంలో ఒకడైన షారుక్ ఖాన్ చారిత్రాత్మక విజయాలు నమోదు చేశాడు. అలాంటి షారుక్ కి గడ్డు కాలం ఎదురైంది. ఒక్క సినిమా ఆడలేదు. ఎన్ని ప్రయోగాలు చేసినా ఫలితం ఇవ్వలేదు. దాంతో ఓ రెండేళ్లు బ్రేక్ తీసుకున్నాడు. కమ్ బ్యాక్ అనంతరం చేసిన పఠాన్ బ్లాక్ బస్టర్ కొట్టింది. అదే ఊపులో నెలల వ్యవధిలో జవాన్ అంటూ ప్రేక్షకులను పలకరించారు. జవాన్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ ఇందుకు కారణమైంది. జవాన్ మరో విజువల్ ట్రీట్ అని భావించిన ఆడియన్స్ రికార్డు స్థాయిలో టికెట్స్ బుక్ చేశారు.
పఠాన్ కి మించిన రెస్పాన్స్ జవాన్ కి దక్కింది. మరి ఆడియన్స్ అంచనాలు జవాన్ అనుకుందా?. ఇప్పటికే జవాన్ ప్రీమియర్స్ ముగియగా ట్విట్టర్ లో ఆడియన్స్ సినిమా పట్ల తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయంలో జవాన్ మూవీ ఆకట్టుకుంది. స్టోరీ, నరేషన్, విజువల్స్ అద్భుతం అంటున్నారు. ముఖ్యంగా షారుక్ డిఫరెంట్ రోల్స్, గెటప్స్ లో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేశాడని అంటున్నారు.
ఉన్నత నిర్మాణ విలువలతో తెరకెక్కించిన యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు ప్రధాన బలం అంటున్నారు. దర్శకుడు అట్లీ స్టైలిష్ మేకింగ్ హాలీవుడ్ చిత్రాలను తలపించిందన్న మాట వినిపిస్తోంది. షారుక్ ఖాన్ పాత్రలో వేరియేషన్స్ థ్రిల్ చేస్తాయి. ఇక నయనతార పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారని అంటున్నారు. కథలో ఆమె పాత్ర కీలకంగా సాగుతుందట. విలన్ గా విజయ్ సేతుపతి మరోసారి అదరగొట్టారని ట్విట్టర్ టాక్.
దీపికా పదుకొనె గెస్ట్ రోల్ అదనపు ఆకర్షణ. ఇక ప్రియమణి తన రోల్ లో ఆకట్టుకుందన్న మాట వినిపిస్తోంది. అనిరుధ్ మ్యూజిక్ పై మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. మొత్తంగా షారుక్ ఫ్యాన్స్ తో పాటు యాక్షన్ మూవీ లవర్స్ కి జవాన్ విజువల్ ట్రీట్ అంటున్నారు. ట్విట్టర్ టాక్ చూస్తే షారుక్ మరో బ్లాక్ బస్టర్ నమోదు చేశాడనిపిస్తుంది. మరి సినిమా ఏ స్థాయి విజయం సాధించిందో చెప్పాలంటే వీకెండ్ వరకు వేచి చూడాలి…
I just saw the film of the century!!#Jawan ♥️
All I want to say at this point is You’re all in for an Incredibly Supremely Immensely successful Cinematic Euphoric viewing experience!!!! And @iamsrk has knocked it out of the PARK. In fact the Park is a Dot!
JUST Watch
— Ridhi Dogra (@iRidhiDogra) September 6, 2023
What a movie ….just explosion on screen when SRK appear….story is awesome….srk killed it..⭐⭐⭐⭐#Jawan
— s.yadav (@suresh28239899) September 7, 2023