Jailer : అపోలో హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ చంద్రా రెడ్డి అంటే తెలియని వారు ఉండరు. దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆయనకు హాస్పిటల్స్ ఉన్నాయి. తన నలుగురు కూతుర్లు కూడా తన హాస్పిటల్ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. వారిలో పెద్దకూతురు శోభన కామినేని కూతురే ఉపాసన. ఈమె మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ను వివాహం చేసుకుంది. ఇటీవల ఒక పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి కి జైలర్ నిర్మాత కళానిధి మారన్ భార్య కావేరి మారన్ ఒక చెక్కు ఇచ్చారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ.. ఈ సినిమాకు పనిచేసిన వారందరికీ చెక్కులు ఇస్తోంది. అయితే సినిమాతో సంబంధం లేని ప్రతాప్ సి రెడ్డికి చెక్కు ఏంటి అనేదే ఆశ్చర్యంగా ఉంది కదా?
ఇటీవల విడుదలైన జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టును సొంతం చేసుకుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. ఈ చిత్రంలో కథానాయకుడి పాత్ర పోషించిన రజనీకాంత్ కు ఇప్పటికే ఒక ఖరీదైన కారును కళానిధి మారన్ బహుమతిగా ఇచ్చారు. దర్శకుడు నెల్సన్, సంగీత దర్శకుడు అనిరుధ్ కు కూడా కార్లను బహుమతిగా ఇచ్చాడు కళానిధి మారన్. ఈ చిత్రం ద్వారా తీసుకున్న రెమ్యూనరేషన్ 200 కోట్లకు చేరడంతో.. భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకున్న రికార్డును రజనీకాంత్ నెలకొల్పాడు. ఇక ఈ సినిమా అందించిన లాభాలతో నిర్మాత కళానిధి మారన్ పండగ చేసుకుంటున్నాడు. ఆగస్టు 10న విడుదలైన ఈ సినిమా నెల రోజులు పూర్తికాకముందే ప్రపంచవ్యాప్తంగా 650 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసింది. నిజానికి సన్ పిక్చర్స్ చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఇది చాలా అధికం. సినిమా లాభాల్లో భాగాన్ని హీరో, దర్శకుడు, సంగీత దర్శకుడికి ఇచ్చాడు నిర్మాత కళానిధి మారన్.
ఈ సినిమా ఘనవిజయాన్ని పురస్కరించుకొని ముందుగా హీరో రజనీకాంత్ ను కలిసి కళానిధి మారన్ చెక్కు ఇచ్చాడు. అయితే ఆ చెక్కులో ఎంత అమౌంట్ ఉంది అనేది చెప్పలేదు. అది 100 కోట చెక్కు అని ప్రచారం జరిగింది. అప్పటికే రెమ్యూనరేషన్ కింద రజనీకాంత్ కు 110 కోట్లు ఇచ్చారని టాక్. దీనికి కళానిధి మారన్ ఇచ్చిన చెక్కు అదనమని కోలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఒకటి. 1.55 కోట్ల విలువచేసే బీఎండబ్ల్యూ ఎక్స్ 7 కారును రజనీకాంత్ కు కళానిధి మారన్ బహుమతిగా అందజేశారు. దీనిని ఇక్కడితో ఆపకుండా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కు ఒక చెక్కు, సుమారు కోటి రూపాయల విలువ చేసే పోర్షే మకాన్ లగ్జరీ కారును అందజేశారు. అలాగే సంగీత దర్శకుడు అనిరుధ్ కు కూడా ఒక చెక్కు, పోర్షే మకాన్ లగ్జరీ కారును కూడా అందజేశారు.
జైలర్ సినిమా ద్వారా వచ్చిన లాభాలలో కొంత భాగాన్ని సామాజిక సేవ కోసం కూడా వినియోగిస్తున్నారు కళానిధి మారన్. ఇందులో భాగంగానే అపోలో ఆస్పత్రులకు చెక్కు ఇచ్చారు. 100 మంది నిరుపేద పిల్లలకు గుండె శస్త్ర చికిత్స నిమిత్తం కోటి రూపాయల చెక్కును అపోలో ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్ సి రెడ్డికి సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ సతీమణి కావేరి మారన్ అందజేశారు. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. సన్ పిక్చర్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. చిన్నపిల్లల గుండె శస్త్ర చికిత్సల కోసం చేసిన ఈ సాయం చాలా గొప్పదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
On behalf of Sun Pictures, Mrs. Kavery Kalanithi handed over a cheque for Rs.1 Crore to Dr. Prathap Reddy, Chairman, Apollo Hospitals, towards heart surgery for 100 under privileged children.
#Jailer #JailerSuccessCelebrations pic.twitter.com/o5mgDe1IWU— Sun Pictures (@sunpictures) September 5, 2023