https://oktelugu.com/

Shah Rukh Khan: పన్నులు కట్టడంలోనూ కింగ్ నే.. బాలీవుడ్ లో అత్యధికంగా కట్టేది ఈ హీరోనే…

సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులు స్టార్ హీరోలుగా మారి భారీ మొత్తం లో రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్న విషయం మనకు తెలిసిందే...

Written By:
  • Gopi
  • , Updated On : September 5, 2024 / 01:12 PM IST

    Shah Rukh Khan

    Follow us on

    Shah Rukh Khan: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన లైఫ్ స్టైల్ ని అనుభవిస్తూ ఉంటారు. సినిమాల ద్వారా, అడ్వర్టైజ్మెంట్ల ద్వారా భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలు భారీ ఎత్తున ట్యాక్స్ కూడా పే చేస్తుంటారు. ఇక ఇండియాలో ఇప్పటివరకు చాలామంది స్టార్ హీరోలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్నారు. అందులో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్క హీరో వాళ్ల సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇండియాలో ఉన్న హీరోలందరితో అత్యధికంగా ఆస్తులను కలిగి ఉన్న హీరో షారుక్ ఖాన్ అనే విషయం మనకు తెలిసిందే…ఇక ఇప్పుడు షారుఖ్ ఖాన్ తో కలిపి కొంతమంది స్టార్ హీరోలు ఎంత ట్యాక్స్ పే చేశారు అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    బాలీవుడ్ బాద్షా గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు షారుక్ ఖాన్… ఈ సంవత్సరానికి గాను ఆయన 92 కోట్ల టాక్స్ ను పే చేసినట్టుగా తెలుస్తుంది. తనకు సినిమా ఇండస్ట్రీలో వచ్చే రెమ్యూనరేషనే కాకుండా బయట చాలా బిజినెస్ లు కూడా ఉన్నాయి. దాంతోపాటుగా ఐపీఎల్ లో కలకత్తా నైట్ రైడర్స్ టీమ్ కూడా షారుక్ ఖాన్ గారిదే కావడం విశేషం…

    ఇక తమిళం లో స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న విజయ్ కూడా ప్రస్తుతం భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో ఒకరిగా వెలుగు పొందుతున్నాడు. ఇక ఈయన 80 కోట్ల రూపాయలను ట్యాక్స్ గా పే చేశాడు…

    ఇక బాలీవుడ్ కండల వీరుడుగా గుర్తింపుని సంపాదించుకున్న సల్మాన్ ఖాన్ సైతం భారీ రేంజ్ లో ఆస్తులను కూడబెట్టిన విషయం మనకు తెలిసిందే. అలాగే తను ఒక్క సినిమా కోసం 100 కోట్లకు పైన రెమ్యూనరేషన్ తీసుకుంటాడనే విషయం కూడా మనకు తెలిసిందే. ఇక ఇలాంటి సందర్భంలో సల్మాన్ ఖాన్ 75 కోట్ల రూపాయలను ట్యాక్స్ గా పే చేసిన విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది…

    ఇక బిగ్ బి అమితాబచ్చన్ కూడా భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటాడనే విషయం తెలిసిందే. రీసెంట్ గా కల్కి సినిమాతో ఒక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న అమితాబచ్చన్ తన మార్కెట్ ను మరింతగా పెంచుకొని ప్రస్తుతం రెమ్యూనరేషన్ ను భారీ రేంజ్ లో చార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక తను కూడా ఈ సంవత్సరం 71 కోట్ల ట్యాక్స్ ను పే చేసినట్టుగా తెలుస్తుంది…

    ఇక వీళ్ళ తర్వాత స్థానాల్లో అజయ్ దేవగన్ (42కోట్లు), రన్బీర్ కపూర్ (36కోట్లు), హృతిక్ రోషన్ (28 కోట్లు), కపిల్ శర్మ (26 కోట్లు), కరీనా కపూర్ (20 కోట్లు), అల్లు అర్జున్ (14 కోట్లు), మోహన్ లాల్ (14 కోట్లు) చెల్లించారు…