https://oktelugu.com/

Vijayawada Floods : విజయవాడ వాసులే కాదు.. ఏబీఎన్ రాధాకృష్ణ సైతం బుడమేరులో మునిగిపోయాడు..

బుడమేరు వాగు ప్రవాహం ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని ముంచెత్తడం.. ఆ కార్యాలయానికి వెళ్లే దారి మొత్తం నీటితో నిండిపోవడంతో.. ఉద్యోగులు ఇంటి దగ్గర నుంచి పనిచేస్తున్నారు. కొన్ని కీలక పేజీలను హైదరాబాదులోని సెంట్రల్ డెస్క్ నుంచి పేజినేషన్ చేసి పంపిస్తున్నారు. ఇక ప్రింటింగ్ ఇతర ప్రాంతాల లో చేసి.. విజయవాడకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 5, 2024 1:13 pm
    Andra Jyothi Office

    Andra Jyothi Office

    Follow us on

    Vijayawada Floods : చుట్టూ నీరు.. వెళ్లేందుకు దారి లేదు.. ఇప్పట్లో ఆ నీరు తగ్గుతుందనే నమ్మకం లేదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. అందుకే గత్యంతరం లేక ఇంటి దగ్గర నుంచే పనిచేస్తున్నారు.. ఇదేదో భారీ వర్షాల వల్ల ఐటీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పరిస్థితి కాదు.. ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న జర్నలిస్టులు స్వయంగా ఎదుర్కొంటున్న అనుభవం.. అదేంటి ఆంధ్ర జ్యోతి ఉద్యోగులు ఇంటి దగ్గర నుంచి పనిచేయడం ఏంటి? ఇవేమీ కోవిడ్ రోజులు కాదు కదా.. అనే అనుమానం మీలో కలుగుతోంది కదా.. మీ అనుమానానికి సమాధానమే ఈ కథనం.

    బుడమేరు ఉప్పొంగి ప్రవహించడంతో విజయవాడ నగరం మొత్తం మునిగిపోయింది. సింగ్ నగర్ నుంచి మొదలు పెడితే భవానీ ద్వీపం వరకు నీట మునిగి కనిపిస్తోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. ఈ క్రమంలో విజయవాడ నగరంలో ఏ కాలనీ చూసినా వరద కష్టాలే. ఆహారం దొరక్క, పాలు లభించక, తాగేందుకు నీరు లేక ప్రజలు నరకం చూస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నా ప్రజలకు బాధలు తప్పడం లేదు. ఈ బాధలు విజయవాడ ప్రజలకు మాత్రమే కాదు.. విజయవాడ లోని ఆంధ్రజ్యోతి ఉద్యోగులకు కూడా ఎదురవుతున్నాయి. బుడమేరు వాగు ప్రవాహం ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని ముంచెత్తడం.. ఆ కార్యాలయానికి వెళ్లే దారి మొత్తం నీటితో నిండిపోవడంతో.. ఉద్యోగులు ఇంటి దగ్గర నుంచి పనిచేస్తున్నారు. కొన్ని కీలక పేజీలను హైదరాబాదులోని సెంట్రల్ డెస్క్ నుంచి పేజినేషన్ చేసి పంపిస్తున్నారు. ఇక ప్రింటింగ్ ఇతర ప్రాంతాల లో చేసి.. విజయవాడకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నిండా నీరు ఉండడంతో పేపర్ వేసేదారి లేక.. సర్కులేషన్ తగ్గించారని తెలుస్తోంది.

    బుడమేరు ప్రవాహంతో నిండిపోయింది

    ఆంధ్రజ్యోతి కార్యాలయానికి వెళ్లే రోడ్డు బుడమేరు ప్రవాహంతో నిండిపోయింది. కనీసం అక్కడికి వెళ్లేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. దీంతో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని యాజమాన్యం కల్పించింది. ఫలితంగా స్టేట్ బ్యూరో నుంచి.. విజయవాడ సిటీ బ్యూరో గారుతో అందరూ ఇంటి వద్ద నుంచే పని చేస్తున్నారు.. అడ్మినిస్ట్రేషన్ స్టాప్ కు సెలవులు ఇచ్చారని తెలుస్తోంది.. ఆంధ్రజ్యోతి కార్యాలయానికి వెళ్లే దారి నీటితో మునగడంతో.. దానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.. మరోవైపు చంద్రబాబు నాయుడు తన ఇంటిని బుడమేరు ప్రవాహం చుట్టుముట్టకుండా ఉండేందుకు లాకులు ఎత్తారని.. అది విజయవాడ నగరం తో పాటు రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని కూడా నీట ముంచిందని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. తన కార్యాలయానికి వెళ్లే రోడ్డు నీటితో నిండా మునిగినప్పటికీ.. తన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు ఇంటి దగ్గర నుంచే విధులు నిర్వహిస్తున్నప్పటికీ… ఈ విషయాలను ఆంధ్రజ్యోతి చెప్పడం లేదని వారు చెబుతున్నారు.. దాదాపు మూడు రోజుల దాకా వరద ఇలానే ఉంటుందని.. శనివారం వినాయక చవితి సందర్భంగా పేపర్ ప్రచురితం కాదు, ఆదివారం నుంచి రాకపోకలు సాగే అవకాశం ఉందని తెలుస్తోంది.. ఇదే విషయాన్ని ఆంధ్రజ్యోతిలో పనిచేసే ఉద్యోగులు అంతరంగిక సంభాషణల్లో చర్చించుకుంటున్నారు.