https://oktelugu.com/

Telugu Film Industry: ఇండస్ట్రీ పెద్ద లేకపోవడం వల్ల ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయా..?

చాలామంది చిన్న హీరోలు, ప్రొడ్యూసర్లు,డైరెక్టర్లు నష్టపోతున్నారు. మరి ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి ఎవరైనా ఒకరు ఇండస్ట్రీ పెద్దగా బాధ్యతను తీసుకుంటే బాగుంటుందంటూ సినిమా ఇండస్ట్రీలో నటులు గాని అలాగే దర్శకులు గాని అభిప్రాయపడుతున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : February 20, 2024 / 03:10 PM IST
    Follow us on

    Telugu Film Industry: ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయడానికి కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు ఉండేవారు. ముఖ్యంగా దాసరి నారాయణరావు ఈ బాధ్యతను చాలా సక్సెస్ ఫుల్ గా కొనసాగించాడు. ఆ తర్వాత ఇండస్ట్రీ పెద్ద లేకపోవడం వల్ల ఇండస్ట్రీలో చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఎదురవుతున్నాయి.

    వాటికి పరిష్కారం చూపించే వాళ్ళు లేకపోవడంతో చాలామంది చిన్న హీరోలు, ప్రొడ్యూసర్లు,డైరెక్టర్లు నష్టపోతున్నారు. మరి ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి ఎవరైనా ఒకరు ఇండస్ట్రీ పెద్దగా బాధ్యతను తీసుకుంటే బాగుంటుందంటూ సినిమా ఇండస్ట్రీలో నటులు గాని అలాగే దర్శకులు గాని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇంతకుముందు చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా ఉంటాడని అందరు అనుకున్నప్పటికీ దానిమీద మోహన్ బాబు కొంతవరకు సెటైరికల్ గా స్పందించడంతో చిరంజీవి తను ఇండస్ట్రీ పెద్దగా ఉండదలచుకోలేదంటూ ఓపెన్ గా స్టేట్ మెంట్ అయితే ఇచ్చాడు.

    అయితే మోహన్ బాబు ఇండస్ట్రీ పెద్ద గా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, మోహన్ బాబు చెబితే ఇండస్ట్రీలో వినే వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఆయన ఇండస్ట్రీ పెద్దగా ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయలేడు అంటూ ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది వాళ్ల వివరాలు తెలియజేస్తున్నారు. చిరంజీవి కనక ఇండస్ట్రీ పెద్దగా ఉంటే ఆయన అన్ని ప్రాబ్లమ్స్ ను చాలా సింపుల్ గా మేనేజ్ చేస్తూ ఎవరికీ అన్యాయం జరగకుండా చూసుకుంటారు. కాబట్టి చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా ఉంటే అందరికీ న్యాయం జరిగుతుంది అనే ఉద్దేశ్యంలో అందరూ ఉన్నట్టుగా తెలుస్తుంది.

    మరి ఇలాంటి క్రమం లో చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా తన బాధ్యతను స్వీకరిస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చిరంజీవి అందరికీ పెద్దగా బాధ్యతలు స్వీకరిస్తే బాగుంటుందంటూ చాలామంది సిరి ప్రముఖులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మరి అందరి ని అర్థం చేసుకుని చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా ఉంటాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…