Hollywood: థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు ఈ ఒక్క హాలీవుడ్ మూవీ చూడండి.. మంచి కిక్కిస్తుంది…

Hollywood: హాలీవుడ్ లో చాలామంది డైరెక్టర్స్ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడానికి చాలా గొప్ప గొప్ప సినిమాలైతే తీశారు. ఇక అందులో 'డేవిడ్ ఫించర్' ఒకరు... ఇక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను చేయడంలో తనను మించిన దర్శకుడు మరొకరు లేరు

Written By: Gopi, Updated On : June 6, 2024 6:11 pm

Seven one of the most watchable crime fiction movie

Follow us on

Hollywood: మన ఇండియన్ సినిమాలతో పోలిస్తే హాలీవుడ్ సినిమాలు టెక్నాలజీ పరంగా చాలా ముందంజ లో ఉంటాయి. ఇక ఇప్పుడిప్పుడు రాజమౌళి(Rajamouli) పుణ్యమాని తెలుగు సినిమా స్థాయి గానీ, ఇండియన్ సినిమా ప్రభావం గానీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. కానీ ఒకప్పుడు మాత్రం ఇండియన్ సినిమా అంటే అసలు హాలీవుడ్ జనాలకు సరిగ్గా తెలిసేది కూడా కాదు.

ఇక ఇదిలా ఉంటే హాలీవుడ్ లో చాలామంది డైరెక్టర్స్ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడానికి చాలా గొప్ప గొప్ప సినిమాలైతే తీశారు. ఇక అందులో ‘డేవిడ్ ఫించర్'(David Fincher) ఒకరు… ఇక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను చేయడంలో తనను మించిన దర్శకుడు మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన తీసిన ప్రతి సినిమా కూడా ఒక కొత్త రకం సినిమా స్టైల్ ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూనే ఉంటుంది. ఇక మొత్తానికైతే 7(Seven) అనే సినిమాతో ఆయన ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించాడనే చెప్పాలి.

Also Read: Vikram Thangalaan: విక్రమ్ తంగలన్ సినిమా రిలీజ్ అయ్యేది ఎప్పుడు..?

1995 లో వచ్చిన ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇక ఇప్పటికి కూడా మన ఇండియన్ సినిమాల్లో ఏదైనా థ్రిల్లర్ సినిమా వచ్చిందంటే ఈ 7 మూవీ తాలూకు రిఫరెన్సెస్ చాలా ఎక్కువ సంఖ్యలో కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఈ సినిమాను తీసిన డైరెక్టర్ అయిన డేవిడ్ ఫించర్ ప్రపంచంలోనే అత్యంత గొప్ప దర్శకుడి గా కూడా పేరు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పటికీ కూడా ఈ సినిమాను ఒక క్లాసిక్ సినిమాగా అభివర్ణిస్తూ ఉంటారు. తెలుగులో ఇప్పుడున్న చాలామంది స్టార్ డైరెక్టర్స్ ఈ సినిమాకి అభిమానులు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

Also Read: Anasuya: వయసులో అనసూయ ఎలా ఉండేదో తెలుసా… సంచలన ఫోటోలు వైరల్

ఇక ఈ సినిమా ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ రూపంలోనే కాకుండా ఈ సినిమాలో డేవిడ్ ఫించర్ మేకింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇందులో ఒక్కొక్క సీన్ చూస్తున్నప్పుడు ప్రతి ప్రేక్షకుడు సీట్ ఎడ్జ్ లో కూర్చోకుండా ఉండలేడు. అలాంటి ఒక ది బెస్ట్ థ్రిల్లర్ సినిమాని అందించిన డేవిడ్ ఫించర్ కి ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు చెప్పాల్సిందే.. ఇక మీలో ఎవరైనా ఇప్పటి వరకు ఈ సినిమాని చూడకపోతే అమెజాన్ ప్రైమ్ లో అవలెబుల్ లో ఉంది ఒకసారి వెళ్లి చూడండి…ఈ సినిమా ఇచ్చే కిక్కు చాలా గొప్పగా ఉంటుంది.