OG Netflix: మన టాలీవుడ్ లో ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ గా నిల్చిన చిత్రం ‘ఓజీ'(TheyCallHimOG).విడుదలకు ముందే ఈ సినిమాపై ఏ రేంజ్ హైప్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. యూత్ ఆడియన్స్ ఎక్కడ చూసిన ఓజీ మేనియా లో మునిగి తేలారు. ఆ హైప్ ని మ్యాచ్ చేస్తూ, ఈ చిత్రం విడుదలైన తర్వాత ప్రీమియర్ షోస్ నుండే ఫ్యాన్స్ నుండి అద్భుతమైన పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. విమర్శకులు ఈ చిత్రం కేవలం ఫ్యాన్స్ కోసమే తీసింది, సినిమాలో పెద్దగా విషయం లేదు, జనరల్ ఆడియన్స్ మీ డబ్బులు సేవ్ చేసుకోండి లాంటి రివ్యూస్ ఇచ్చారు. కానీ కలెక్షన్స్ పై ఎలాంటి ప్రభావం పడలేదు. మొదటి రోజున 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఫుల్ రన్ 316 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది.
ఇకపోతే థియేటర్స్ లో ఈ చిత్రం ఏ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుందో, ఓటీటీ లో విడుదలయ్యాక అంతకు మించిన ఎక్కువ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. విడుదలై 47 రోజులు పూర్తి అయ్యింది. ఈ 47 రోజుల్లో నెల రోజుల పాటు నాన్ స్టాప్ గా టాప్ 10 లో ట్రెండ్ అయ్యింది. ఆ తర్వాత అత్యధిక కొత్త సినిమాలు నెట్ ఫ్లిక్స్ లోకి రావడం తో టాప్ 10 ట్రెండింగ్ నుండి బయటకి వెళ్ళిపోయింది కానీ, ఫుల్ రన్ లో మాత్రం అదిరిపోయే రేంజ్ వ్యూస్ తో ముందుకు వెళ్తోంది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి 47 రోజుల్లో 1 కోటికి పైగా వ్యూస్ వచ్చినట్టు సమాచారం. ఫుల్ రన్ లో ఈ సినిమా కచ్చితంగా 15 మిలియన్ కి పైగా వ్యూస్ ని సొంతం చేసుకుంటుందని, ఇండియా లో అత్యధిక వ్యూస్ ని సాధించిన చిత్రాల్లో కచ్చితంగా ఈ సినిమా ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు.
ఇది ఎంత వరకు నిజం అవుతుందో రాబోయే రోజుల్లో చూడాలి. ముఖ్యంగా ఈ సినిమా జెన్ Z ఆడియన్స్ లో అత్యంత ఆదరణ పొందింది. ఇన్ స్టాగ్రామ్ ని అత్యధికంగా ఉపయోగించేది వాళ్ళే కాబట్టి, ఎక్కడ చూసినా ఇప్పుడు ఓజీ మూవీ లోని సన్నివేశాలకు సంబంధించిన మీమ్స్ ని ఉపయోగిస్తూ వస్తున్నారు. ఈమధ్య కాలం లో ఒక స్టార్ హీరో సినిమాకు ఈ రేంజ్ లో ఇన్ స్టాగ్రామ్ మీమ్స్ రావడం ఎప్పుడూ చూడలేదు. ప్రతీ సందర్భం లోనూ ఎక్కువగా ఇంటర్వెల్ సన్నివేశాన్ని ఇష్టమొచ్చినట్టు వాడేస్తున్నారు. అందుకే ఈ చిత్రానికి నెట్ ఫ్లిక్స్ లో ఆ రేంజ్ వ్యూస్ వస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.