Samantha : చాలా కాలం నుండి సోషల్ మీడియా లో సమంత(Samantha Ruth Prabhu) రెండవ పెళ్లి గురించి ఏ రేంజ్ లో చర్చలు జరుగుతున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఆమె మాజీ భర్త నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) శోభిత ధూళిపాళ్ల(Sobhita Dhulipala) ని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో, సమంత కూడా ఇంకొకరిని పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడితే చూడాలని ఉందంటూ ఆమె అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అయితే గత కొంతకాలం నుండి సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru) తో డేటింగ్ చేస్తుందని, వీళ్లిద్దరు త్వరలోనే పెళ్లాడబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అందుకు కారణం వీళ్లిద్దరు కలిసి ఈమధ్య కాలం లో బయట ఎక్కువగా తిరుగుతూ ఉండడమే. రీసెంట్ గా కూడా వీళ్లిద్దరు ఫ్లైట్ లో సెల్ఫీ తీసుకుంటూ కనిపించారు. ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే మనుషులు ఉన్న ఈ కాలంలో ఇన్ని క్లూలు ఇచ్చిన తర్వాత కూడా కనిపెట్టకుండా ఉంటారా మీరే చెప్పండి?.
Also Read : ట్విట్టర్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సమంత..మొదటి పోస్ట్ అతనిపైనే!
అయితే ఈ విషయాన్ని ఎక్కువ కాలం దాచలేం అని సమంత కూడా అర్థం చేసుకుంది. అందుకే రీసెంట్ గానే ఆమె ఈ విషయాన్ని తన తల్లితో, స్నేహితులతో, సన్నిహితులతో అధికారికంగా చెప్పేసిందట. సమంత తల్లికి రాజ్ నిడిమోరు మంచి స్నేహితుడు అనే విషయం అయితే తెలుసు కానీ, పెళ్లి చేసుకునేంత ఇష్టం అతని పై ఉందని ఇన్ని రోజులు తెలియదట. ఇది ఆమెకు స్వీట్ సర్ప్రైజ్ అని అనొచ్చు. రాజ్ నిడిమోరు కూడా తన కుటుంబ సభ్యులతో సమంత తో పెళ్లి గురించి చర్చించాడట. ఇరువురి కుటుంబాల నుండి అనుమతి లభించిందని, ఈ నెలలోనే నిశ్చితార్థం చేసుకొని, వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే సమంత అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. త్వరలోనే ఈ విషయంపై పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే, అనారోగ్యం కారణంగా ఏడాది వరకు విశ్రాంతి తీసుకుంటూ వచ్చిన ఆమె, ఇప్పుడు మళ్ళీ షూటింగ్స్ తో బిజీ కానుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమె కేవలం హీరోయిన్ గా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా వ్యవహరించనుంది. ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే నిర్మాణ సంస్థని ప్రారంభించిన సమంత, తొలి సినిమాని కొత్త నటీనటులతో తీసింది. ‘శుభం’ అనే టైటిల్ తో తెరకెక్కిన హారర్ కామెడీ చిత్రానికి సంబంధించిన టీజర్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఆమె సొంత నిర్మాణ సంస్థలోనే ప్రధాన పాత్రలో ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రం కూడా చేస్తుంది. ఇవి కాకుండా ఆమె నెట్ ఫ్లిక్స్ లో ‘రక్త బ్రహ్మాండ’ అనే భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ లో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ మళ్ళీ బిజీ కానుంది సమంత.
Also Read : ‘అలేఖ్య పికిల్స్’ పై సమంత ఫన్నీ రియాక్షన్..వైరల్ అవుతున్న మెసేజ్!