Hyundai Creta : కారు కొనాలని అనుకున్నా ఎక్కువగా SUV కార్ల వైపై మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ వేరింట్ లను అందుబాటులోకి తీసుకొచ్చిన కంపెనీ సేల్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. బూట్ స్పేస్ తో పాటు బాహుబలి లాంటి ఇంజిన్, హ్యాచ్ బ్యాక్ కంటే అదనపు ఫీచర్లు ఉండడం వల్ల ఎస్ యూవీ కార్ల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల ఎస్ యూవీ వేరియంట్ లో ఓ మోడల్ ను వినియోగదారులు ఆదరిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ కారు అమ్మకాల్లో వృద్ధి సాధిస్తోంది. ఇంతకీ ఆ కారు ఏదంటే?
దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ కంపెనీ ప్రత్యేకంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఎస్ యూవీ వేరియంట్ లను తీసుకురావడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఇందులో భాగంగా ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన క్రెటా ది బెస్ట్ మోడల్ గా నిలిచింది. ఇటీవల 2024 త్రైమాసిక ఫలితాలను రిలీజ్ చేసింది. ఇవి గత ఏడాది కంటే 5.68 శాతం వృద్ధి సాధించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే కంపెనీ 91 వేల యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. గత ఏడాది జనవరి – జూన్ మధ్య జరిగిన అమ్మకాలను ఈ ఏడాది ఇదే కాలంలో విక్రయాలను పోలిస్తే 11 శాతం వృద్ధి సాధించినట్లు తెలుస్తోంది.
హ్యుందాయ్ కి చెందిన కార్లలో క్రెటా ప్రత్యేకంగా నిలుస్తోంది. క్రెటా మొత్తం 7 వేరియంట్లలో అందుబాటులో ఉంది. అయితే ఫీచర్లు, డిస్కౌంట్ల ఆధారంగా ఒక్కో వేరియంట్ ఒక్కో ధరను కలిగి ఉంది. లేటేస్ట్ గా క్రెటా ఫేస్ లిప్ట్ అమ్మకాలు ఊపందుకున్నాయి. ఈ మోడల్ లో 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లేను కలిగి ఉంది.క్లైమేట్ కంట్రోల్ తో పాటు డ్యూయెల్ జోన్ ఏసీ ఉన్నాయి. సేప్టీ కోసం 360 డిగ్రీ కెమెరా, అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టె సిస్టమ్ ఉన్నాయి. పనోరమిక్ సన్ రూప్, వైర్ లెస్ ఛార్జర్ వంటివి ఆకర్షిస్తాయి.
అయితే 2024 జూలైలో క్రెటా స్పోర్టియట్ మోడల్ ఎన్ లైన్ ను రిలీజ్ చేసింది. పాత మోడల్ లో ఉన్న ఫీచర్లను కొద్దిగా మార్చి అప్డేట్ చేశారు. క్రెటా నుంచి ఎన్ని వేరియంట్లు వచ్చినా వాటికి ఆదరణ తగ్గడం లేదు.ఇందులో ఉండే మూడు ఇంజిన్లు ఆకర్షించనున్నాయి. క్రెటా ఫేస్ లిప్ట్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5 నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి. 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో పనిచేస్తుంది.