https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ 8 లోకి మరో హాట్ బ్యూటీ..చివరి నిమిషంలో ఆడియన్స్ కి డబుల్ బొనాంజా ఇవ్వబోతున్న టీం!

రెగ్యులర్ గా ఈ సీరియల్ ని చూసేవారికి ఈమె బాగా తెలుసు. అంతేకాదు ఈమెకి ఇంస్టాగ్రామ్ లో 5 లక్షల 27 వేలమంది ఫాలోవర్లు కూడా ఉన్నారు. 38 ఏళ్ళ వయస్సు ఉన్న ఈమె, సోషల్ మీడియా లో తనకి సంబంధించిన హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది.

Written By:
  • Vicky
  • , Updated On : August 15, 2024 / 07:36 PM IST

    Bigg Boss 8 Telugu(8)

    Follow us on

    Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 గురించి సోషల్ మీడియా లో రోజుకో ఆసక్తికరమైన అప్డేట్ అభిమానులను ఉత్సాహపరుస్తుంది. ఇప్పటికే ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ గురించి మీ అందరికీ ఒక అవగాహన వచ్చే ఉంటుంది. తేజస్విని గౌడా, రీతూ చౌదరీ, బంచిక్ బబ్లూ, యాదమరాజు, నిఖిల్, ఆదిత్య ఓం, అంజలి పవన్ ఇలా ఎంతో మంది పేర్లు ఖరారు అయ్యాయి. వీరితో యాంకర్ విష్ణు ప్రియా, ప్రేరణ కంభం, జబర్దస్త్ నరేష్, కిరాక్ ఆర్ఫీ వంటి ప్రముఖుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరితో పాటుగా ఎవ్వరూ ఊహించని కంటెస్టెంట్స్ కూడా ఈ షో లో పాల్గొనబోతున్నారని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. వారిలో ప్రముఖ సీరియల్ నటి జ్యోతి రాయ్ కూడా ఉంది. స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ‘గుప్పెడంత మనసు’ వంటి సూపర్ హిట్ సీరియల్ లో ఈమె జగతి పాత్ర ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ సీరియల్ చూడని వారికి ఈమె పేరు పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు.

    కానీ రెగ్యులర్ గా ఈ సీరియల్ ని చూసేవారికి ఈమె బాగా తెలుసు. అంతేకాదు ఈమెకి ఇంస్టాగ్రామ్ లో 5 లక్షల 27 వేలమంది ఫాలోవర్లు కూడా ఉన్నారు. 38 ఏళ్ళ వయస్సు ఉన్న ఈమె, సోషల్ మీడియా లో తనకి సంబంధించిన హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది. వాటికి వేల సంఖ్యలో లైక్స్, కామెంట్స్ కూడా వస్తుంటాయి. అలా సోషల్ మీడియా లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈమెని బిగ్ బాస్ యాజమాన్యం సంప్రదించి, ఇంటర్వ్యూ కూడా చేశారట. రెమ్యూనరేషన్ కూడా భారీగానే ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే కచ్చితంగా షో రసవత్తరంగా ఉంటుంది. మనసులో అనిపించింది మొహం మీదనే చెప్పే అలవాటు ఉండే ఈమె టాప్ 5 వరకు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇకపోతే గత సీజన్ లో లాగానే ఈ సీజన్ లో కూడా గ్రాండ్ 2.0 లాంచ్ ఉంటుందట. ఈ లాంచ్ ద్వారా బిగ్ బాస్ గత సీజన్స్ కి సంబందించిన కంటెస్టెంట్స్ ఒక 5 మంది హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారట. వీళ్ళు ఈ సీజన్ ప్రారంభమైన 5 వారాల తర్వాత ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తుంది.

    వీరిలో నయనీ పావని పేరు ఖరారు అయ్యింది. ఆమె గత సీజన్ లో వచ్చిన మొదటి వారం లోనే ఎలిమినేట్ అయ్యింది. చూసేందుకు అమ్మాయి ఎంతో చక్కగా ఉంటుంది, గేమ్స్ కూడా అద్భుతంగా ఆడుతుంది, హౌస్ అందరితో కలిసిపోతుంది, అయినప్పటికీ కూడా ఆమె ఎలిమినేట్ అవ్వడం అప్పట్లో పెద్ద షాక్. ఆ తర్వాత ఆమె నీతోనే డ్యాన్స్ షో ద్వారా తన సత్తా చాటుకొని రన్నర్ గా నిల్చింది. ఇప్పుడు ఆమె గ్రాండ్ గా మరోసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈసారైనా ఎక్కువ రోజులు హౌస్ లో కొనసాగుతుందో లేదో చూడాలి.