Heroine Nikitha: మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ పేరు నిఖిత. ముంబైకి చెందిన నిఖిత చైల్డ్ ఆర్టిస్ట్ గా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన సోషియో ఫాంటసీ చిత్రం ఘటోత్కచుడు చిత్రంలో నిఖిత నటించింది. ఆ చిత్రంలో ప్రధానంగా సాగే చిట్టి అనే పాత్రలో నిఖిత నటించింది. అనంతరం 2002లో హాయ్ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈవీవీ సత్యనారాయణ కొడుకు ఆర్యన్ రాజేష్ హీరోగా తెరకెక్కిన హాయ్ చిత్రంలో నిఖిత నటించింది. యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన హాయ్ హిట్ టాక్ తెచ్చుకుంది.
ఫస్ట్ మూవీతోనే విజయం అందుకుంది. తెలుగులో రెండో చిత్రం కళ్యాణ రాముడు సైతం హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో వేణు తొట్టెంపూడి హీరోగా నటించారు. నితిన్ కి జంటగా నటించిన సంబరం మాత్రం నిరాశ పరిచింది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. నాగార్జున-రాఘవ లారెన్స్ కాంబోలో వచ్చిన డాన్ చిత్రంలో నిఖిత నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసింది. ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ గా ఆమె కనిపించారు.
డాన్ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అనంతరం కన్నడ, మలయాళ భాషల్లో ఆమె ఎక్కువగా చిత్రాలు చేసింది. ఈ క్రమంలో కన్నడ హీరో దర్శన్ తో ఎఫైర్ నడిపిందనే వార్తలు ఉన్నాయి. దర్శన్ కి అప్పటికే వివాహం జరిగింది. దానితో నిఖిత-దర్శన్ ఎఫైర్ సంచలనంగా మారింది. వీరిద్దరూ కలిసి కొన్ని చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం మరో నటితో ఎఫైర్ లో ఉన్న దర్శన్ జైలు పాలైన సంగతి తెలిసిందే. తెలుగులో నిఖిత చివరిగా నటించిన చిత్రం టెర్రర్. ఈ చిత్రం 2016లో విడుదల కాగా శ్రీకాంత్ హీరోగా నటించాడు.
మరొక విశేషం ఏమిటంటే నిఖిత బిగ్ బాస్ షోలో పాల్గొంది. బిగ్ బాస్ కన్నడ సీజన్ 1లో నిఖిత పాల్గొంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిఖిత బాగానే రాణించింది. ఫైనల్ కి వెళ్లిన నిఖిత టైటిల్ రేసులో నిలిచింది. ఆమె సెకండ్ రన్నర్ స్థానం పొందింది. 2018 తర్వాత నిఖిత పూర్తిగా సిల్వర్ స్క్రీన్ కి దూరమైంది. కన్నడ చిత్రం రాజ సింహ ఆమె చివరి చిత్రం. 2017లో గగన్ దీప్ మాగో అనే ఓ వ్యక్తిని నిఖిత వివాహం చేసుకుంది. వీరికి ఒక బిడ్డ సంతానం.
మంచి ఆరంభము లభించినా నిఖిత కెరీర్లో ఎదగలేకపోయింది. స్క్రిప్ట్స్ ఎంపికలో నిఖిత తడబడింది. నిఖితకు సక్సెస్ రేట్ తక్కువ. అది ఆమె కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపింది. స్టార్ హీరోయిన్ కావాలన్న ఆమె కల నెరవేరలేదు. దాంతో త్వరగా ఫేడ్ అవుట్ అయ్యింది.
కెరీర్ సవ్యంగా సాగుతున్న సమయంలో నిఖిత ఎఫైర్స్ నడపడం కూడా మైనస్ అయ్యింది. కన్నడలో దర్శన్ స్టార్ హీరోగా ఉన్నాడు. ఆయనకు అప్పటికే వివాహం జరిగింది. అయినా నిఖిత అతనితో ఎఫైర్ పెట్టుకుంది. ఈ విషయంలో దర్శన్ ఫ్యాన్స్ ఆమె మీద అసహనం వ్యక్తం చేశారు. మొత్తంగా ఆమె పరిశ్రమకు దూరమైంది. కనీసం క్యారెక్టర్ రోల్స్ కూడా చేయడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం ఆమె అందుబాటులో ఉన్నారు.