Overcoming Failure:ఎదుటివారిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయొద్దు. ఎవరి టాలెంట్ వారికి ఉంటుంది. ఒక రంగంలో ఫెయిల్ అయ్యారని.. చిన్నచూపు చూడొద్దు. ఇదే సమయంలో ఫెయిల్ అయ్యామని, మనతో కాదని మూలన కూర్చోవద్దు. ఓటమిని గెలుపుకు బాటలుగా వేసుకుంటే విజయం దాసోహం అవుతుంది. ఇందుకు ఎంతో మంది నిదర్శనం. తాజాగా బెంగళూరుకు చెందిన 20 ఏళ్ల రితుపర్ణ కూడా తన జర్నీలో ఫెయిల్యూర్‌ను అవకాశాలుగా మలుచుకుని సక్సెస్ పాధించింది. నీట్లో పెయిల్ అయ్యానని కుంగిపోకుండా ఇంజినీరింగ్ మార్గాన్ని ఎంచుకుని ప్రతిష్టాత్మక రోల్స్ రాయిస్ కంపెనీలో ఏడాదికి రూ.72.3 లక్షల ప్యాకేఉజీతో ఉద్యోగం సాధించింది.
వైఫల్యమే కొత్త జర్నీకి మెట్టుగా..
నీట్లో విజయం సాధించలేకపోతే జీవితం అంతమైపోతుందని చాలామంది భావిస్తారు. కానీ, బెంగళూరుకు చెంవదిన రితుపర్ణ ఈ వైఫల్యాన్ని ఓ అవకాశంగా మలచుకుంది. మంగళూరులోని సహ్యాద్రి ఇంజినీరింగ్ కాలేజీలో చేరి, తన నైపుణ్యాలను మెరుగుపరచుకుంది. ఈ నిర్ణయం ఆమె జీవితంలో కీలకమైన టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. వైఫల్యం ఓ తాత్కాలిక ఆటంకం మాత్రమేనని, అది కొత్త దారులను తెరుస్తుందని రితుపర్ణ నిరూపించింది.
Also Read: యువతకు చాణక్యుడు చేసిన హెచ్చరిక ఏంటి?
కఠోర శ్రమ, స్పష్టమైన లక్ష్యం
రితుపర్ణ విజయం వెనుక ఆమె కఠోర శ్రమ, అచంచలమైన లక్ష్యం ఉన్నాయి. సహ్యాద్రి కాలేజీలో చదువుతూ రోల్స్ రాయ్స్లో ఇంటర్న్‌షిప్ సాధించింది. ఎనిమిది నెలలపాటు తన నైపుణ్యాలను, పనితీరును ప్రదర్శించి, కంపెనీలో శాశ్వత ఉద్యోగాన్ని సొంతం చేసుకుంది. ఈ ప్రయాణం ఆమె సాంకేతిక నైపుణ్యాలతోపాటు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, నిరంతర అభ్యాసం, స్వీయ–అభివృద్ధిపై ఆమెకు ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది.
రితుపర్ణ కథ యువతకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. వైఫల్యం అనేది గమ్యం కాదు, కేవలం ఒక మజిలీ. ఆమె జర్నీ ఓపిక, కృషి, సానుకూల దృక్పథంతో ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని నిరూపిస్తోంది. ఆత్మవిశ్వాసాన్ని, కొత్త మార్గాలను అన్వేషించే ధైర్యాన్ని ఇస్తుంది.