https://oktelugu.com/

YSR Chandrababu Web Series: వైఎస్సార్-చంద్రబాబులపై సంచలన వెబ్ సిరీస్… వారి పాత్రల్లో ఆ ఇద్దరు స్టార్స్!

నిజానికి ఈ ఇద్దరి నేతల మధ్య రాజకీయ వైరం తో పాటుగా గొప్ప స్నేహం కూడా ఉంది. ఇద్దరు కూడా ఒకేసారి ఒకే రాజకీయ పార్టీ తో తమ రాజకీయ జీవితం మొదలుపెట్టారు.

Written By:
  • Shiva
  • , Updated On : September 6, 2023 / 12:26 PM IST

    YSR Chandrababu Web Series

    Follow us on

    YSR Chandrababu Web Series: తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన నేతలు ఇద్దరు ఉంటారు ఒకరు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, మరొకరు ఏమో సీఎంగా చేసింది కొద్దీ కాలమే అయినా కానీ రాజకీయంగా తన ముద్రను బలంగా చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వీళ్లిద్దరి నిజ జీవితాలను ఆధారంగా చేసుకుని ప్రముఖ దర్శకుడు దేవా కట్టా ఒక వెబ్ సిరీస్ కు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.

    “నైతికత మారుతుంది.. కానీ అధికారం కోసం జరిగే యుద్ధం స్థిరంగా ఉంటుంది” అంటూ మూడేళ్ల క్రితమే ఒక మోషన్ పోస్టర్ తో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి జీవితాల ఆధారంగా వెబ్ సిరీస్ తీయబోతున్నట్లు ప్రకటించారు దేవా కట్టా. కాకపోతే కొన్ని అనుకోని కారణాల వలన ఈ వెబ్ సిరీస్ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఇదే లైన్ ను సోనీ లివ్ ఓటిటీ సంస్థ అంగీకరించటంతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కబోతుంది.

    నిజానికి ఈ ఇద్దరి నేతల మధ్య రాజకీయ వైరం తో పాటుగా గొప్ప స్నేహం కూడా ఉంది. ఇద్దరు కూడా ఒకేసారి ఒకే రాజకీయ పార్టీ తో తమ రాజకీయ జీవితం మొదలుపెట్టారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టి విజయం సాధించడంతో చంద్రబాబు అటు వెళ్ళిపోయి రాజకీయంగా ఎదిగారు. మరోపక్క వైఎస్ కాంగ్రెస్ లోనే తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించి ముఖ్యమంత్రి అయ్యాడు.

    కాబట్టి ఈ ఇద్దరి నేతల నిజ జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ ఖచ్చితంగా తెలుగు రాష్ట్రల్లో అందరి దృష్టిని ఆకర్షించటం ఖాయం. ఇందులో చంద్రబాబు పాత్ర కోసం దగ్గుబాటి రానా ను సంప్రదించగా ఈ పాత్రకు అతను అంగీకరించినట్లు తెలుస్తోంది. గతంలో ఒకసారి ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు పాత్ర ను పోషించాడు రానా. ఇక వైఎస్ పాత్ర కోసం ఆది పినిశెట్టి ని అప్ప్రోచ్ కావడం దానికి ఆయన ఓకే చెప్పడం కూడా జరిగిపోయాయి.

    అలాగే మిగిలిన పాత్రల కోసం తెలుగులో మంచి ఫేమ్ ఉన్న నటీనటులను తీసుకునే ప్రయత్నంలో ఉంది చిత్ర యూనిట్. నిజానికి గతంలో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ లైన్ కూడా దేవా కట్ట ది. కానీ నిర్మాత విష్ణు ఇంటూరి ఇదే పాయింట్ తీసుకుని ఆ సినిమాను తెరకెక్కించారని దేవాకట్టా ఆవేదన వ్యక్తం చేశాడు. కానీ ఈ వెబ్ సిరీస్ విషయంలో అలాంటిది జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నానని ఒక సారి మోసపోయానని, మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేదని తెలిపారు దేవాకట్టా