Pawan Kalyan OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యంత భారీ హైప్ ని ఏర్పాటు చేసుకున్న చిత్రాల లిస్ట్ తీస్తే రీసెంట్ గా ఆయన చేస్తున్న ‘ఓజీ’ చిత్రం నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి 70 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. కేవలం పవన్ కళ్యాణ్ కి సంబంధించిన 23 రోజుల డేట్స్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అక్టోబర్ నెల నుండి ఆ బ్యాలెన్స్ షూటింగ్ ని పూర్తి చేసేందుకు పవన్ కళ్యాణ్ డేట్స్ కూడా కేటాయించాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ‘గ్లిమ్స్’ వీడియో కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.
పవన్ కళ్యాణ్ నుండి ఈ స్థాయి క్వాలిటీ, స్టాండర్డ్స్ ఉన్న సినిమా వచ్చి చాలా ఏళ్ళు అయ్యింది. డైరెక్టర్ సుజిత్ షాట్ మేకింగ్ స్కిల్స్ కూడా ఫ్యాన్స్ ని పిచ్చెక్కించాయి. ఇకపోతే గ్లిమ్స్ లో వచ్చిన ‘హంగ్రీ చీతా’ థీమ్ సాంగ్ బిట్ కి మిలియన్స్ సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. అన్నీ మ్యూజిక్ ప్లాట్ ఫారమ్స్ లో ఇప్పటికీ ఈ ఆడియో బిట్ ట్రెండింగ్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఈ సినిమా నుండి మరో క్రేజీ అప్డేట్ ని అతి త్వరలోనే మూవీ టీం అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2 వ తారీఖున విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. డైరెక్టర్ సుజిత్ టీజర్ మరియు ట్రైలర్ ని కట్ చేసి చాలా రోజులు అయ్యిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు. సెప్టెంబర్ 2 వ తారీఖున విడుదల చెయ్యబోయే టీజర్ లో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ కూడా చెప్తాడని తెలుస్తుంది. ఇందులో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ కథ మూడు వేర్వేరు కాలాల్లో జరుగుతాయట. పవన్ కళ్యాణ్ లుక్స్ కూడా మూడు విభిన్నమైన గెటప్స్ లో ఉంటాయి.
ఓల్డ్ ఏజ్ లుక్ లో కూడా ఆయన ఇందులో కనిపించబోతున్నాడట. ప్రియాంక మోహన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందించాడు. ఈ సినిమా టీజర్ తో పాటు సెప్టెంబర్ 2 న హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల నుండి కూడా అప్డేట్స్ రానున్నాయట. వీటితో పాటు ‘గబ్బర్ సింగ్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మరోసారి గ్రాండ్ గా రీ రిలీజ్ అవ్వబోతుంది. ఇలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఊపిరి కూడా ఆడనంత ఆనందాన్ని కలిగించే అప్డేట్స్ ఆరోజు ఉండనున్నాయి.ఉపముఖ్యమంత్రి అయ్యాక కేవలం రాజకీయాలకు సంబంధించిన వార్తలనే అభిమానులు గత రెండు నెలలుగా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ చూడబోతున్నారు.