Relationship Tips: హిందూ సంప్రదాయంలో వివాహ బంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. కాలాలతో పాటు మనుషులు, వాళ్ల ప్రవర్తనలు కూడా మారిపోతున్నాయి. ఈరోజుల్లో చాలామంది వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. మహిళలు, పురుషుల అని తేడా లేకుండా చాలామంది ఈ పద్ధతినే ఫాలో అవుతున్నారు. వైవాహిక జీవితం, పిల్లలు, కుటుంబం అంతా బాగానే ఉన్నా సరే వేరే వ్యక్తులలో సంబంధాలు పెట్టుకుంటున్నారు. దీనికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా పెళ్లయిన తర్వాత ఇలా వేరే వాళ్లతో సంబంధాలు పెట్టుకుంటున్నారు. వీటివల్ల చాలామందికి పెళ్లి మీద నమ్మకం పోతుంది. దీనివల్ల ఈతరం యువత పెళ్లికి వెనుకంజ వేస్తున్నారు. పెళ్లి చేసుకుని ఇలా సంబంధాలు పెట్టుకోవడం, విడాకులు తీసుకోవడం వల్ల యువత అసలు పెళ్లికి ఇష్టం చూపించడం లేదు. అయితే పురుషుల కంటే మహిళలే ఎక్కువగా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అసలు పెళ్లయిన వాళ్లు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడానికి అసలు కారణాలేంటో మరి తెలుసుకుందాం.
ప్రస్తుతం మారిన జీవనశైలి వల్ల చాలామంది వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా పార్ట్‌నర్ నుంచి ఎక్కువగా ఎక్స్‌పెట్ చేస్తున్నారు. కొంతమందికి వివాహ బంధం బోర్ కొడుతుంది. భాగస్వామి కొత్తగా లేకుండా ఉండటం, పట్టించుకోకపోవడం, ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వక పోవడం వల్ల వాళ్లు ఇతరులకు ఎట్రాక్ట్ అవుతున్నారు. దాంపత్య జీవితాన్ని సంతోషంగా ఉండటానికి ట్రై చేయరు. భాగస్వామికి ఏం ఇష్టం, ఏవి ఇష్టం లేదో కూడా తెలుసుకోరు. కనీసం ట్రై చేయరు. వీటివల్ల కొందరు ఇతరులకు ఆకర్షితులవుతారు. కొంతమంది గతంలో ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేరు. దీంతో వాళ్లలో మళ్లీ మాట్లాడటం, కలవడం వంటివి చేస్తారు. ఇంట్లో చిన్న గొడవ భాగస్వామితో వస్తే అవతలి వ్యక్తికి దగ్గర అవుతారు.
కొంతమంది వాళ్ల భాగస్వామికి ఫ్రీడమ్ ఇవ్వరు. ఎవరితో మాట్లాడిన ఒప్పుకోరు. ప్రతి చిన్న విషయానికి అనుమానిస్తారు. దీనివల్ల ప్రస్తుతం ఉండే బంధం మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అలా కొత్త బంధం వైపు ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీంతో తొందరగా ఇతర వ్యక్తులకు దగ్గర అవుతారు. ప్రస్తుతం అయితే సోషల్ మీడియా వల్ల చాలామంది ఆన్‌లైన్ యాప్‌లు వంటి వాటి వల్ల సంబంధాలు పెట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో విరివిరిగా డేటింగ్ యాప్‌లు వంటివి ఉన్నాయి. దీంతో భాగస్వామితో చిన్న గొడవ వచ్చిన వెంటనే ఇతరులతో రిలేషన్ పెట్టుకుంటున్నారు. పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఇలాంటివి చేస్తున్నారని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ అధ్యయనం ప్రకారం పురుషుల 35 శాతం ఇతరులతో సంబంధం పెట్టుకుంటున్నారు. కానీ మహిళలు మాత్రం 36 శాతం మంది ఉన్నారు. కుటుంబ కారణాలు, వ్యక్తిగత కారణాలు, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం వల్ల తొందరగా వివాహేతర సంబంధాలకు మక్కువ చూపిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.